shooting in TSRTC Bus at Panjagutta పంజాగుట్ట వద్ద ఆర్టీసీ బస్సులో కాల్పుల కలకలం..

Shooting in tsrtc city bus at panjagutta

shooting in TSRTC Bus, shooting in RTC Bus, shooting in city bus, shooting at panjagutta, shooting at sagar society, TSRTC Bus, Miscreant, panjagutta, secundrabad-manikonda, shooting, hyderabad police, crime

In a Shocking incident, a Miscreant dressed in siut, had shooted his gun targeting in to the co-passenger chest, and then at the top of the bus roof. The bus was heading toward manikonda which departed from secundrabad.

పంజాగుట్ట వద్ద ఆర్టీసీ బస్సులో కాల్పుల కలకలం..

Posted: 05/02/2019 02:31 PM IST
Shooting in tsrtc city bus at panjagutta

నగరంలోని ఆర్టీసీ బస్సులో తుపాకీ కాల్పలు కలకలం రేపాయి. సికింద్రాబాదు నుంచి ఫిల్మ్ నగర్ ప్రాంతానికి వెళ్తున్న బస్సులో పంజాగుట్ట వద్ద గన్‌ ఫైరింగ్ చోటుచేసుకుంది. బస్సు దిగిపొమ్మన్నందుకు ఓ వ్యక్తి ప్రయాణికులతో వాగ్వాదానికి దిగాడు. గన్‌ తీసి ఫైరింగ్‌ చేశాడు. బుల్లెట్‌ బస్సు రూఫ్‌ టాప్‌ నుంచి దూసుకుపోవడంతో ప్రయాణికులు ఒక్కసారిగా హడలిపోయారు. ప్రయాణికులతో పాటు బస్సు డైవ్రర్‌, కండక్టర్ కూడా భయాందోళనకు గురయ్యారు. ఇంతకీ కాల్పులు జరిపిన వ్యక్తి ఎవరన్న విషయమై పోలీసులు విస్తృతంగా అన్వేషిస్తున్నారు.
 
ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తిని కిందకు దిగాలని అడిగినందుకు ఫుట్ బోర్డుపై నిలబడి ప్రయాణం చేస్తున్న వ్యక్తి రెచ్చిపోయాడు. బస్సు దిగేదిలేదంటూ తోటి ప్రయాణికులతో గొడవపడ్డాడు. అంతే కాదు తన దగ్గరనున్న గన్‌తో ఒక్కసారితో కాల్పులు జరిపాడు. ఈ ఘటనతో షాక్‌కు గురైన ప్రయాణికులు భయంతో వణికిపోయారు. అందరినీ గన్‌తో బెదిరించిన దుండగుడు.. ప్రయాణికులతో గొడవపడి.. ఆ తరువాత బస్సు దిగివెళ్లిపోయాడు. ప్రస్తుతం సూట్ వేసుకున్న వ్యక్తి గూరించి పోలీసులు గాలిస్తున్నారు.

సికింద్రాబాదు నుంచి ఇవాళ ఉదయం సుమారు పదకొండు గంటల సమయంలో బయలుదేరిన సిటీ ఆర్డీసీ బస్సు.. ఫిల్మ్‌ నగర్‌ వెళ్తోంది. సిటీ సర్వీసు 47L బస్సు బోర్డుతో (AP28Z4468) నెంబరుతో వెళ్తున్న ఈ బస్సు.. పంజగుట్ట శ్మశాన వాటిక వద్దకు చేరుకోగానే ఈ ఘటన చోటచేసుకుంది. కాల్పుల్లో బస్సు టాప్‌కి రంధ్రాలు పడినట్టు తెలుస్తోంది. అయితే, కాల్పులతో హడలిపోయిన డ్రైవర్ బస్సును ఎక్కడా నిలపకుండా ఫిల్మనగర్ ప్రాంతానికి తీసుకెళ్లినట్లు సమాచారం. కాగా, ఘటనపై ఆర్టీసీ బస్సు డ్రైవర్ యాకూబ్ పాషా గానీ, కండక్టర్ భూపతి కానీ.. బాధితుడు గానీ ఫిర్యాదు చేయలేదు. ఇద్దరి మధ్య గొడవ జరగడంతో కాల్పులు చోటు చేసుకున్నాయి.

కాల్పులు జరిపిన వ్యక్తి సఫారీ డ్రెస్‌లో ఉన్నాడని ప్రయాణికులు తెలిపారు. దీంతో కాల్పులు జరిపింది నాయకులకు సెక్యూరిటీగా వుండే గన్ మెన్లా.. లేక బౌన్సర్లా అన్నది తెలియాల్సి వుంది. ఈ ప్రాంతంలో అనేక స్టార్ హోటళ్లు కూడా వుండటంతో పోలీసులు ఈ కోణంలోనూ దర్యాప్తు సాగిస్తున్నారు. ఇక గన్ కు లైసెన్సు వుందా.? అన్నది కూడా తేలాల్సి వుంది. మరోవైపు సమాచారం అందుకున్న పోలీసులు బస్సుతో పాటు కాల్పులు జరిపిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TSRTC Bus  Miscreant  panjagutta  secundrabad-manikonda  shooting  hyderabad police  crime  

Other Articles