టీడీపీ కార్యకర్తలపై, అభిమానులపై నోటితోపాటు చేయి కూడా చేసుకుంటూ తరచూ వివాదాల్లోకి చిక్కకునే సినీనటుడు, హిందూపురం టీడీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. మరోమారు వార్తల్లోకెక్కారు. తనకు ఎంత మెజారిటీ వస్తుందో ముందే అంచనా వేసిన అభిమానిపై అగ్రహాన్ని వ్యక్తం చేశారు. చెప్పినంత మెజారిటీ రాకపోతే అంటూ ఇంద్ర సినిమాలో చిరంజీవి చెప్పిన పాపులర్ డైలాగ్ ను అందుకున్నారు. అంతేకాదు లోపిపారదొబ్బుతా అని కూడా వార్నింగ్ ఇచ్చాడు.
హిందూపురం నుంచి మళ్లీ అసెంబ్లీకి పోటీ చేస్తున్న బాలకృష్ణ ఈసారి మరింత రెచ్చిపోయారు. పైకి సరదాగా కనిపిస్తూనే.. గొంతు కోస్తా, ఏసేస్తా రేయ్ అంటూ కార్యర్తలను హడలెత్తించారు. పక్కన ఉన్న తన భార్య వసుంధర చూడాలని మరీ తిట్లకు లంకించుకున్నారు. తన సతీమణి వసుంధరతో కలసి హిందూపురం నియోజకవర్గంలోని గ్రామాల్లో రోడ్ షో నిర్వహించిన ఆయన ఈ సందర్బంగా పార్టీ అభిమానులపై అగ్గిపడుగయ్యారు. ఎన్నికల ప్రచారంలో బాలయ్య తీరు విమర్శలకు దారితీసింది. బాలయ్య మాటలకు, చేష్టలకు అంతా షాక్ అవుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. ఎన్నికల ప్రచారరథంపై భార్య వసుంధరతో కలసి వెళ్తున్న బాలయ్యను చూసి సంబరంతో ఓ కార్యకర్త.. ‘మీకు 50 వేలు, 60 వేల మెజారిటీ వస్తుంది.. ’ అని అరిచాడు. అప్పటికే ప్రచారంలో డస్సిపోయి మాంచి కాకమీదున్న బాలయ్య.. వేలల్లో మెజారిటీ ఏంటిరా అయ్యా కస్సుబుస్సుమన్నాడు. ‘హైప్ క్రియేట్ చేసేవారి పీక కోయాలి..’ అని భార్యతో అంటూ గొంతుకోస్తున్నట్లు తన తలకింద చేయి పెట్టాడు. కానీ ఆమె పెట్టించోకుండా చేతులూపసాగారు.
తర్వాత మరో కార్యకర్త ‘మీకు 60 వేలు, 70 వేల మెజారిటీ వస్తుంది’ అని అన్నాడు. దీంతో బాలయ్యకు మండిపోయింది. ‘నీ అడ్రసేంటి పేరేంటి. అంత మెజారిటీ రాకపోతే పీక కోస్తా.. ఏసేస్తా’ అని సినీస్టయిల్లో హెచ్చరించారు. అంతటితో ఆగకుండా లేపిపారదొబ్బుతా అంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. ఈ సన్నివేశాలను స్థానికులు తమ మొబైల్ ఫోన్లలో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అవి కాస్తా ఇప్పుడు వైరల్ గా మారాయి. బాలయ్య సరదాగా అన్నట్లు కనిపించినా.. ఆ తిట్లు, బూతులు ఏంటని విమర్శలు వస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
May 19 | పెళ్ళంటె పందిళ్ళు.. సందళ్ళు, తప్పెట్లు.. తాళాలు తలంబ్రాలూ, మూడే ముళ్ళు.. ఏడే అడుగులు.. మొత్తం కలిసీ నూరేళ్ళు అంటూ ఎవర్వైనా తమ పెళ్లి అనగానే ఆ రోజున ఎంతో ఆనందంగా ఉంటూ.. అహ్లాదకరంగా గడపుతారు.... Read more
May 19 | ప్రేమ అనేది రెండు అక్షరాలే అయినా ఎప్పుడు ఎవరి మీద ఎలా కలుగుతుందో చెప్పలేం. ఇక ప్రేమ కలిగిన తర్వాత అబ్బాయి, తన ప్రేమను అమ్మాయికి తెలుపడానికి నానా తిప్పలు పడుతుంటాడు. ఎలా తనలో... Read more
May 19 | పంజాబ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు, భారత మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూకు సుప్రీంకోర్టు జైలు శిక్షను విధించింది. ఏడాది పాటు జైలు శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. 1988లో రోడ్డుపై గొడవ పడిన... Read more
May 19 | మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాలనలో హిందువులపై అదనపు పన్నులు వేసిన ఇబ్బందులకు గురిచేశాడన్న విషయం చరిత్ర పాఠ్యపుస్తాకాల్లో నిక్షిప్తమైవుంది. ఈ అంశమే ఇప్పుడు మహారాష్ట్రలో ప్రజల మధ్య శాంతియుత వాతావరణానికి భంగం కలిగిస్తోంది. ఇటీవల... Read more
May 19 | ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)లోని ఏఈసీ పాఠశాలలో ఉపాధ్యాయ ఆశావహులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని... Read more