court grants bail to mohanbabu in cheque bounce case చెక్ బౌన్స్ కేసులో మోహన్ బాబుకు ఊరట

Court grants bail to actor mohanbabu in cheque bounce case

Mohanbabu convicted in cheque bounce case, Mohanbabu sentenced in cheque bounce case, mohan babu granted bail in cheque bounce case, year jail term for Mohanbabu, Mohanbabu, actor, politician, yvs chowdary, Erramanzil court, Hyderabad, Crime

A city court in Erramanzil colony had convicted actor mohan babu in cheque bounce case and sentenced him terming one year jail, after his advocate filed a petition for bail the court had granted bail to the actor.

చెక్ బౌన్స్ కేసులో మోహన్ బాబుకు ఊరట..

Posted: 04/02/2019 03:42 PM IST
Court grants bail to actor mohanbabu in cheque bounce case

ప్రముఖ సినీ నటుడు, వైసీపీ నాయకుడు మోహన్ బాబుకు హైదరాబాదులోని ఎర్రమంజిల్ కోర్టు షాకిచ్చింది. ఆయనుకు ఏడాది కాలం పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. ఆ వెనువెంటనే మోహన్ బాబుకు ఊరట కూడా కలిగించింది. ఆయనపై గతంలో దాఖలైన చెక్ బౌన్స్ కేసులో ఇవాళ తుది తీర్పును వెలువరించిన న్యాయస్థానం ఆయనకు ఏడాది జైలు శిక్షను విధిస్తూ తుది తీర్పును వెలువరించింది.

దీంతో ఆయన తరపు న్యాయవాది న్యాయస్థానంలో బెయిల్ పిటీషన్ దాఖలు చేయడంతో విచారించిన న్యాయస్థానం ఆయనకు బెయిల్ కూడా మంజూరు చేసింది. లక్ష్మీ ప్రసన్నా పిక్చర్స్ బ్యానర్ పై వైవీఎస్ చౌదరి నిర్మించిన సలీమ్ చిత్రానికి సంబంధించి పెట్టుబడులు విషయంలో.. మోహన్ బాబు ఇచ్చిన నలబై లక్షల 50 వేల రూపాయల చెక్కులు బౌన్స్ అయ్యాయి. దీంతో 2010లో ఆయన న్యాయస్థానాన్ని అశ్రయించాడు. వైవీఎస్ పిటీషన్ ను స్వీకరించిన న్యాయస్థానం అప్పటి నుంచి ఇవాళ్టి వరకు సుదీర్ఘకాలం విచారణ చేపట్టింది.

కాగా ఇవాళ ఈ కేసు విషయమై తుది తీర్పును వెలువరించిన ఎర్రమంజిల్ న్యాయస్థానం మోహన్ బాబుకు ఏడాది శిక్షను విధించడంతో పాటు చెల్లించాల్సిన  సదరు మొత్తానికి లక్షా 25 వేలను అపరాద రుసుమును కలిపి మొత్తం రూ. 41.75 లక్షల రూపాయలను వైవీఎస్ చౌదరికీ చెల్లించాలని అదేశాలను జారీ చేసింది. ఈ మొత్తాన్ని మూడు నెలల్లోగా చెల్లించాలని న్యాయస్థానం అదేశించింది. అయితే ఈ న్యాయస్థానం తీర్పుపై మోహన్ బాబు రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టుకు వెళ్లి అపీలు చేసుకుంటారా.? లేక న్యాయస్థానం తీర్పునుసారం నడుచుకుంటారా.? అన్నది వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mohanbabu  actor  politician  bail  yvs chowdary  Erramanzil court  Hyderabad  Crime  

Other Articles