vangaveeti radhakrishna performs sri yagam చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని వంగవీటి రాధ శ్రీయాగం

Vangaveeti radhakrishna performs sri yagam to make chandrababu cm agian

vangaveeti radha krishna, Sri Yagam, Chandrababu, chief minister, General Elections 2019, TDP, Assembly Elections, Lagadapati Rajagopal, machilipatnam, vijayawada, Andhra Pradesh, Politics

Vijayawada reputed kapu leader vangaveeti radhakrishna performs sri yagam with his sister and brother in law, to make chandrababu CM again for andhra pradesh

చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని వంగవీటి రాధ శ్రీయాగం

Posted: 04/01/2019 12:21 PM IST
Vangaveeti radhakrishna performs sri yagam to make chandrababu cm agian

విజయవాడ ప్రముఖ నాయకుడు వంగవీటి రాధా కృష్ణ టీడీపీలో చేరినా అయనకు తాను ఆశించిన సీటును కానీ ఇటు పార్లమెంట్లు స్థానం నుంచి కానీ చంద్రబాబు ఆయనను బరిలోకి దింపలేదు. అందుకు గల కారణాలు ఏమైవుంటాయో అన్న సంధిగ్థంలో ఆయన అభిమానులు వుండిపోయారు. అయన ఇక మళ్లీ టీడీపీ గూటిని నుంచి వెళ్లిపోతారా.? ఆయనను టీడీపీ గూటికి మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఏ హామీపై తీసుకెళ్లారన్న టాక్ చర్చనీయాంశంగా మారింది.

ఈ క్రమంలో అందరి అంచనాలను బ్రేక్ చేస్తూ వంగవీటి రాధాకృష్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలంటూ శ్రీయాగం నిర్వహిస్తూ వార్తల్లో నిలిచారు. మూడు రోజుల పాటు కొనసాగే శ్రీయాగాన్ని రాధా తన చెల్లెలు, బావలతో చేయిస్తున్నారు. క్రితం రోజు ఉదయం రాధా సోదరి ఆషా, ఆమె భర్త పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మొదట గోపూజ, అనంతరం వాస్తు హోమం నిర్వహించి ఆపై శ్రీయాగం మొదలుపెట్టారు.

రుత్విక్కుల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యాగం ఏప్రిల్ 3న పూర్ణాహుతితో ముగుస్తుంది. శ్రీయాగం చేయడం వల్ల ప్రజలు సుఖశాంతులతో ఉంటారని, శత్రుపీడ, సంకల్పసిద్ధి జరుగుతుందని వంగవీటి రాధా తెలిపారు. రాష్ట్రాన్ని సుభిక్షం చేయాలని తపిస్తున్న చంద్రబాబునాయుడు మళ్లీ ముఖ్యమంత్రి కావాలన్న కోరికతోనే ఈ యాగం చేస్తున్నట్టు వివరించారు. విజయవాడలోని కేజే గుప్తా కల్యాణమంటపంలో ఈ యాగం జరుగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vangaveeti radha krishna  Sri Yagam  Chandrababu  chief minister  Andhra Pradesh  Politics  

Other Articles