BSP Ties Up With Pawan Kalyan’s Jana Sena సరికొత్త అధ్యయం: జనసేనతో పోత్తు కుదుర్చుకున్న బీఎస్పీ..

Pawan kalyan backs mayawati for pm post after bsp jana sena tie up

pawan kalyan, janasena, Pawan Kalyan Mayawati, Janasena BSP, Andhra Pradesh, andhra-pradesh-lok-sabha-elections-2019, Bahujan samaj party, BSP, Chandrababu Naidu, Communist Party of India-Marxist, congress, Derek O'Brien, dmk, dravida munnetra kazhagam, election commission, EVMs, andhra pradesh, politics

The BSP joined hands with superstar-turned-politician Pawan Kalyan's Jana Sena for AP assembly elections. BSP supremo Mayawati announced that the seats have already been finalized between the parties. She said, "It will be great to see Pawan as AP chief minister. We will soon be beginning our campaign."

సరికొత్త అధ్యాయం: జనసేనతో పోత్తు కుదుర్చుకున్న బీఎస్పీ..

Posted: 03/15/2019 02:37 PM IST
Pawan kalyan backs mayawati for pm post after bsp jana sena tie up

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో తృతీయ ప్రత్యామ్నాయంగా అవిర్భవించిన జనసేన పార్టీ రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలతో పాటు మధ్య తరగతి ప్రజల సమస్యలను వెలుగెత్తి చాటుతూ ముందుకు దూసుకెళ్తోంది. పార్టీ ఐదవ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరంచుకుని క్రితం రోజున రాజమండ్రిలో లక్షలాధి మంది జనసైనికుల సమక్షంలో జనసేనాని పవన్ కల్యాణ్ ప్రకటించిన మానిఫెస్టోలో కూడా మహిళలు, విద్యార్థులు, మత్స్యకారులు, రైతులతో పాటు బడగు, బలహీన వర్గాలతో పాటు మధ్యతరగతి ప్రజలకే ఎన్నికల హామీలను గుప్పించారు.

ఇక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూలు విడుదలైన సరిగ్గా 27 రోజులు మాత్రమే మిగిలివున్న వేళ.. రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త అధ్యయనానికి పవన్ నాంది పలికారు. కీలక రాజకీయ పొత్తుకు తెరలేపారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తాము జనసేన పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి ఈరోజు ప్రకటించారు. యూపీలోని లక్నోలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో పవన్ కల్యాణ్ తో కలిసి మాయావతి మాట్లాడారు. ఇరుపార్టీల మధ్య సీట్ల పంపిణీపై అంగీకారం కుదిరిందని మాయావతి తెలిపారు.


త్వరలోనే పవన్ కల్యాణ్ తో కలిసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తామని అన్నారు. పవన్ కల్యాణ్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నట్లు అభిలషించారు. మాయావతికి తాము మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. ఈ దేశానికి ప్రధానిగా మాయావతిని చూడాలనుకుంటున్నామని.. అది తమ పార్టీ బలమైన అభిలాష అన్నారు. దేశానికి దళిత నేత ప్రధాని కావాల్సిన అవసరం ఉందన్నారు. మాయావతి మార్గనిర్దేశకత్వం చాలా అవసరమన్నారు.

అంబేడ్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. సామాజిక న్యాయం అందరికీ అందాల్సిన అవసరముందన్నారు. ఏపీలో బీఎస్పీకి ఎన్నిస్థానాలు కేటాయించేది త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి మాట్లాడుతూ..పొత్తులపై ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలిపారు. ఏపీ,తెలంగాణలో జనసేనతో సీట్ల సర్దుబాటు దాదాపు ఫైనల్ అయినట్లు తెలిపారు.

కాగా, జనసేన పార్టీ పొత్తులో భాగంగా ఎన్ని సీట్లను బీఎస్పీకి కేటాయించిందన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. అయితే అటు వామపక్షాలతో పాటు ఇటు బీఎస్పీతో పొత్తు పెట్టుకున్న పవన్ కల్యాన్.. అపారమైన రాజకీయ అనుభవం వున్న నేతగా అడుగులు వేస్తూ.. ప్రత్యర్థి పార్టీలను ఖంగుతినిపిస్తున్నాడని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  Mayawati  Bahujan Samaj Party  andhra pradesh  politics  

Other Articles