RBI cuts key repo rate by 25 basis points రెపో రేటు సవరణ.. గృహరుణాలపై వడ్డీ తగ్గింపు..

Rbi reduces repo rate by 25 points loans to get cheaper

ShaktiKanth das, MCLR, Repo rate, RBI, RBI policy rates, Home loan , MPC , EMI, Pradhan Mantri Awas Yojana, PMAY, Monetary Policy Committee, Home Loans, Interst on Home Loans

The Reserve Bank of India (RBI) today in its last Monetary Policy Committee (MPC) meeting for this financial year cut the repo rate by 25 basis points to 6.25 percent. For the existing home loan takers who were expecting a rate cut,

రెపో రేటు సవరణ.. గృహరుణాలపై వడ్డీ తగ్గింపు..

Posted: 02/07/2019 12:45 PM IST
Rbi reduces repo rate by 25 points loans to get cheaper

ఆర్థికవేత్తలు, పారిశ్రామిక వర్గాల అంచనాలకు తగినట్టుగానే భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) ఇవాళ శుభవార్త చెప్పింది. 17 నెలల తర్వాత ఎట్టకేలకు కీలక వడ్డీరేట్ల తగ్గిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నికలకు వెళ్లనున్న తరుణంలో కేంద్ర బడ్జెట్ లో కూడా ప్రజలు, కార్మికులు, రైతలుపై వరాలు కురిపించిన కేంద్రం.. అదే తరహాలో ఇటు మధ్యతరగతి వాసులను మరింతగా తమ వైపుకు ఆకర్షించుకునేందుకు చర్యలు తీసుకుంది.

తాజాగా భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంత్ దాస్ అధ్యక్షతన ఇవాళ జరిగిన ద్రవ్య విధాన పరపతి సమీక్షలో మధ్యతరగతి ప్రజలకు గృహరుణాల నుంచి కొంత ఉపశమనం అందిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో ఇప్పుడు 6.50 శాతం నుంచి 6.25 శాతానికి దిగివచ్చింది. రివర్స్ రెపోరేటును సైతం 6 శాతంగానూ, బ్యాంకు రేటును 6.5శాతంగానూ నిర్ణయించారు.
 
ఆర్బీఐ గవర్నర్‌గా శక్తికాంత దాస్ బాధ్యతలు చేపట్టిన తర్వాత చేపట్టిన తొలి ద్రవ్య విధాన సమీక్ష ఇదే కావడం మరో విశేషం. ఆగస్టు 2017లో చివరిసారి వడ్డీరేట్లను తగ్గించారు. తాజాగా ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాలతో రుణాలు మరింత చౌకగా లభించే అవకాశాలున్నట్టు ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. కాగా జీడీపీ వృద్ధి లక్ష్యాన్ని మాత్రం ఆర్బీఐ యథాతథంగా 7.4 శాతంగానే ఉంచింది. ద్రవ్యోల్బణం జనవరి-మార్చి మధ్య 2.4 శాతంగానూ, ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య 3.2-3.4 శాతంగానూ ఉంటుందని అంచనా వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ShaktiKanth das  MCLR  Repo rate  RBI  RBI policy rates  Home loan  Interest  

Other Articles