mahesh-babu-sends legal notices to gst commissioner ‘‘మహేష్ అనే నేను..చట్టానికి కట్టుబడ్డ పౌరుడినే..’’

Mahesh babu sends legal notices to gst commissioner over bank accounts freeze

Telugu superstar, tollywood prince, Mahesh Babu, legal notices, gst commissioner, GST, Goods and Services Tax department, ICICI Bank, Axis Bank, politics

Actor Mahesh babu sends legal notices to The Goods and Services Tax department commissioner for siezing his bank accounts in recovery of service tax dues.

‘‘మహేష్ అనే నేను..చట్టానికి కట్టుబడ్డ పౌరుడినే..’’

Posted: 12/28/2018 05:27 PM IST
Mahesh babu sends legal notices to gst commissioner over bank accounts freeze

టాలీవుడ్ ప్రిన్స్, ప్రముఖ హీరో మహేశ్ బాబు అకౌంట్ల సీజ్ వ్యవహారంలో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వస్తు, సేవా పన్ను(జీఎస్టీ)బకాయిలు చెల్లించలేదంటూ హైదరాబాద్ జీఎస్టీ కమిషనరేట్ ఆయనకు నోటీసులు పంపించి.. బ్యాంకు అకౌంట్లు సీజ్ చేశామని చెప్పిన నేపథ్యంలో ఆయన జీఎస్టీ అధికారులకు లీగల్ నోటీసులు పంపారు. ఈ వ్యవహారంపై స్పందించిన సూపర్ స్టార్ ఈ మేరకు తన న్యాయవాదులతో చర్యలకు ఉపక్రమించారు.

తాను చట్టానికి కట్టుబడి ఉండే పౌరుడిని, ఆర్జనకు తగిన విధంగా అటు ఐటీ, ఇటు జీఎస్టీ పన్నులన్నీ తాను సక్రమంగా చెల్లించానని చెప్పారు. ఈ మేరకు ప్రిన్స్ మహేశ్ వస్తు పన్ను సేవా జీఎస్టీ కమిషనర్ కు లీగల్ నోటీస్ పంపారు. హైదరాబాద్ జీఎస్టీ కమిషనరేట్ కోర్టు పరిధిలో ఉన్న బ్యాంక్ అకౌంట్లను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నిలిపివేయడం సరికాదని ఆ నోటీసులో పేర్కొన్నారు.

కాగా, 2007-08 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.18.5 లక్షల సేవా పన్నును చెల్లించాల్సి ఉందని, అప్పటి నుంచి ఇప్పటివరకూ పన్నులు, వడ్డీ, జరిమానా మొత్తం కలిపి రూ. 73.5 లక్షలు రికవరీ చేసేందుకు జీఎస్టీ అధికారులు నోటీసులు జారీ చేశారు. సెక్షన్ 65 (105) (జెడ్ జెడ్ జెడ్ జెడ్ క్యూ) ద్వారా 2010 జులై 1 నుంచి అంబాసిడర్ సేవలను పన్ను పరిధిలోకి చేర్చారని మహేశ్ లీగల్ టీమ్ స్పష్టం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  legal notices  gst commissioner  service tax  tollywood  politics  

Other Articles