High court to hear Hero prabhas petition on friday హీరో ప్రభాస్ గెస్ట్ హౌస్ సీజ్ పిటీషన్ వాయిదా..

High court to hear hero prabhas petition on friday

Hero Prabhas, prabhas rayadurgam guest house, telangana government, High court, Telangana

Hero prabas filed petition in High court against Telangana Government for siezing his guest house at rayadurgam, the apex court had adjourned his petition to friday.

హీరో ప్రభాస్ పిటీషన్ పై.. హైకోర్టులో విచారణ వాయిదా

Posted: 12/20/2018 12:17 PM IST
High court to hear hero prabhas petition on friday

తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా తన ఇంటిని సీజ్ చేసిందని న్యాయపోరాటం చేస్తున్న ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్‌ రాజు అలియాస్ హీరో ప్రభాస్ ఇవాళ నిరాశే ఎదురైంది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండల పరిధిలోని రాయదుర్గంలో తాను చట్టబద్దంగా కొనుగోలు చేసిన గెస్ట్ హౌజ్ ను తెలంగాణ రెవెన్యూ అధికారులు సీజ్ చేయడంపై ఏకంగా హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

తాను క్రమం తప్పకుండా ఆస్తి పన్ను, విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్న ఇంటిని రెవెన్యూ అధికారులు ప్రభుత్వభూమిగా పేర్కొంటూ సీజ్ చేయడం అన్యాయమని అరోపిస్తూ ఆయన హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. తన ఇంటి స్థలం రెగ్యూలరైజేషన్ కోసం దాఖలు చేసిన ఎల్ఆర్ఎస్ కూడా ప్రభుత్వం వద్దే పెండింగ్ లో వుందని.. దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ప్రభుత్వం తన ఇంటిని సీజ్ చేయడంపై ఆయన న్యాయపోరాటం చేస్తున్నారు.

కాగా, ప్రభాస్ పీటీషన్ ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం, వాదనలు వింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్ కుమార్, ఈ వివాదంపై ఇప్పటికే విచారణ జరుగుతోందని గుర్తు చేస్తూ, ప్రభుత్వ భూమిలో ఆక్రమణలపై నడుస్తున్న అదే కేసులో ప్రభాస్ పిటిషన్ ను చేర్చవచ్చని అన్నారు. దీనిపై అత్యవసరంగా విచారణ జరపాలని ప్రభాస్ తరఫు న్యాయవాది వాదించినా, వాదనలు శుక్రవారం వింటామని చెబుతూ, కేసును డిసెంబర్ 21కి వాయిదా వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles