Modi govt working only to fix political opponents ఎన్డీయే నుంచి అర్ఎల్ఎస్పీ ఔట్.. పదవికి ఉపేంద్ర కుష్వానా రాజీనామా.!

Modi govt working only to fix political opponents upendra kushwana

upendra kushwaha, upendra kushwaha split from nda, upendra kushwaha resigns, rlsp quits nda, upendra kushwaha quits nda, upendra kushwaha quits bjp, bihar alliance, nitish kumar, upendra kushwaha nitish kumar relations, rlsp seat share, Bihar politics

At loggerheads with the BJP over seat-sharing for upcoming general elections, Rashtriya Lok Samta Party (RLSP) leader Upendra Kushwaha quit from his post as Union Minister and walked out of the NDA alliance in Bihar and at the Centre.

ఎన్డీయే నుంచి అర్ఎల్ఎస్పీ ఔట్.. పదవికి ఉపేంద్ర కుష్వానా రాజీనామా.!

Posted: 12/10/2018 03:16 PM IST
Modi govt working only to fix political opponents upendra kushwana

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ భాగస్వామిగా వున్న రాష్ట్రీయ లోక్ శక్తి పార్టీ ప్రభుత్వం నుంచి తప్పకుంది. ఆ పార్టీ అధినేత కేంద్ర మంత్రి ఉపేంద్ర కుష్వాహ తన పదవికి కూడా రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన ప్రధాని కార్యాలయానికి, లోక్ సభ స్పీకర్ కూ పంపించారు. రానున్న 2019 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన సీట్ల పంపిణీ సక్రమంగా జరగడం లేదని ఆరోపిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

2014 ఎన్నికల్లో ఎన్డీయేలో భాగస్వామ్యంగా ఉన్న ఆర్ఎల్ఎస్పీకి మూడు స్థానాలు ఇవ్వగా, మూడింటా విజయం సాధించిన తమ పార్టీకి వచ్చే సంవత్సరం జరిగే ఎన్నికల్లో 7 సీట్లు కావాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అయితే, బీజేపీ, జేడీయూలు మాత్రం రెండు సీట్లను మాత్రమే కుష్వాహ ఆర్ఎలఎస్సీ పార్టీకి కేటాయిస్తామని తేల్చిచెప్పిన నేపథ్యంలో గత కొంతకాలంగా ముభావంగా వున్నారు. ఈ విషయంలో పునరాలోచించుకోవాలని కూడా ఆయన కోరారు.

అయితే పునారోలచన ప్రసక్తే లేదని, రానున్న ఎన్నికలలో కేవలం రెండు స్థానాలతోనే సరిపెట్టుకోవాలని బీజేపి అధిష్టానం మరోమారు తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో ఆయన కేంద్రంలోని ప్రభుత్వం నుంచి తాము తప్పుకుంటున్నట్లు స్పష్టం చేశారు. అంతేకాదు తన కేంద్రమంత్రి పదవికి కూడా రాజీనామా చేశారు. ఎన్డీయే కూటమిలో తమకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వడంలేదని విమర్శలు గుప్పించారు. అందరినీ కలుపుకుని ఎన్నికలకు వెళ్లాల్సిన పార్టీలు.. ఇలా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం ఎంతవరకు సబబని నిలదీశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : upendra kushwaha  NDA alliance  Union Minister  Bihar  Politics  

Other Articles