chitoor dsp durga prasad suspended అక్రమసంబంధం ఎఫెక్ట్: డీఎస్సీ దుర్గాప్రసాద్ సస్పెన్షన్..

Dsp caught red handed with married woman suspended

tirupati dsp, Tiruchanur, extra marrital affair, dsp durga prasad suspended, dsp caught with married woman, Chittoor DSP illicit affair, Chittoor DSP suspended, chittoor, DGP RP Thakur, Andhra Pradesh, Crime

The DSP Pagadala Durgaprasad who is working as an Assistant Commander in APSP 9th battalion at Mangalagiri was suspended by DGP as he developed an extra-marital relation with a woman on the promise of a job offer in TTD.

వివాహితతో అక్రమ సంబంధం: డీఎస్సీ దుర్గాప్రసాద్ పై సస్పెన్షన్ వేటు

Posted: 11/27/2018 11:22 AM IST
Dsp caught red handed with married woman suspended

ఉద్యోగం పేరుతో మాయమాటలు చెప్పి వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్న డీఎస్పీ రాసలీలల వ్యవహరం వెలుగుచూడటంతో ఆయనపై పోలీసు ఉన్నాతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. హైదరాబాద్ లో గతంలో నివసించిన మంగళగిరి బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్, డీఎస్పీ దుర్గాప్రసాద్‌ తన ఇంటి పక్కన నివసిస్తున్న రెడ్డి ప్రసాద్ అనే వ్యక్తి కుటుంబంతో సన్నిహితంగా మెలిగేవారు. టీటీడీలోని అటవీ శాఖలో ఉద్యోగం ఉందని, తిరుపతికి వస్తే అతడికి ఉద్యోగం ఇప్పిస్తానంటూ డీఎస్పీ నమ్మబలికాడు. ఆయన మాటలు నమ్మిన దంపతులు 6 నెలల కిందట హైదరాబాద్‌ నుంచి తమ నివాసాన్ని తిరుచానూరుకు మార్చారు.

అయితే.. రెడ్డి ప్రసాద్ భార్యతో డీఎస్పీ దుర్గాప్రసాద్ కు అప్పటికే వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. వారి రాసలీలలు యథేచ్చగా కొనసాగించడానికి ఇద్దరూ కలిసి తెలివిగా వారి మకాం తిరుపతికి మార్చేలా ప్లాన్ చేసినట్లు సమాచారం. 6 నెలలుగా ప్రయత్నిస్తున్నా ఉద్యోగం రాకపోవడం, ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తడంతో.. రెడ్డి ప్రసాద్ ఉద్యోగ వేటలో మళ్లీ హైదరాబాద్ చేరుకున్నాడు. ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం సంపాదించాడు.

రెడ్డి ప్రసాద్ హైదరాబాద్‌కు వచ్చేసినా.. ఆయన భార్య మాత్రం తిరుచానూరులోనే ఉండటానికి ఆసక్తి కనబరిచింది. దీంతో ఆయన ఇక్కడ విధులు నిర్వహిస్తూ.. 10 రోజులకోసారి తిరుచానూరుకు వచ్చిపోతున్నారు. భర్త లేని సమయంలో డీఎస్పీ దుర్గా ప్రసాద్ తరచూ ఆమె ఇంటికి వెళ్లేవారు. రెడ్డి ప్రసాద్‌కు వారిపై అనుమానం రావడంతో నిఘా పెట్టి విషయం కనుక్కున్నారు. ఆ తర్వాత వారిద్దరినీ హెచ్చరించారు. అయినా.. వారు తమ ప్రవర్తన మార్చుకోలేదు. ఆదివారం ఉదయం వారిద్దరూ ఏకాంతంగా గడుపుతుండగా.. రెడ్డి ప్రసాద్ పక్కా సమాచారంతో తన కుటుంబసభ్యులు, పోలీసు సిబ్బందితో కలిసి అపార్ట్‌మెంట్‌ వద్దకు చేరుకున్నారు. తన భార్య, డీఎస్పీ ఇద్దరూ కలిసి ఉండగా పట్టుకున్నారు. అయితే డీఎస్పీ తెలివిగా అక్కడి నుంచి పరారయ్యారు.

రెడ్డి ప్రసాద్ భార్యను అరెస్టు చేసిన పోలీసులు ఆమెను స్టేషన్‌కు తరలించారు. రెడ్డి ప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఉద్యోగం ఇప్పిస్తానంటూ తనను మోసగిస్తూ తన భార్యతో శారీరక సంబంధం కొనసాగిస్తున్నాడంటూ రెడ్డి ప్రసాద్ ఫిర్యాదు చేశారు. పోలీసుల రాకతో పరారైన దుర్గాప్రసాద్‌ను క్రమశిక్షణా చర్యల ఉల్లంఘన కింద సస్పెండ్ చేస్తున్నట్లు డీజీపీ ఆర్పీ ఠాకూర్ సోమవారం వెల్లడించారు. ఈ మేరకు డీజీపీ కార్యాలయం నుంచి ఉత్వర్వులు వెలవడ్డాయి.

పరారీలో ఉన్న డీఎస్పీ దుర్గా ప్రసాద్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. రెడ్డి ప్రసాద్‌కు వారిపై అనుమానం రావడంతో నిఘా పెట్టి విషయం కనుక్కున్నారు. ఆ తర్వాత వారిద్దరినీ హెచ్చరించారు. అయినా.. వారు తమ ప్రవర్తన మార్చుకోలేదు. ఆదివారం ఉదయం వారిద్దరూ ఏకాంతంగా గడుపుతుండగా.. రెడ్డి ప్రసాద్ పక్కా సమాచారంతో తన కుటుంబసభ్యులు, పోలీసు సిబ్బందితో కలిసి అపార్ట్‌మెంట్‌ వద్దకు చేరుకున్నారు. తన భార్య, డీఎస్పీ ఇద్దరూ కలిసి ఉండగా పట్టుకున్నారు. అయితే డీఎస్పీ తెలివిగా అక్కడి నుంచి పరారయ్యారు.

రెడ్డి ప్రసాద్ భార్యను అరెస్టు చేసిన పోలీసులు ఆమెను స్టేషన్‌కు తరలించారు. రెడ్డి ప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఉద్యోగం ఇప్పిస్తానంటూ తనను మోసగిస్తూ తన భార్యతో శారీరక సంబంధం కొనసాగిస్తున్నాడంటూ రెడ్డి ప్రసాద్ ఫిర్యాదు చేశారు. పోలీసుల రాకతో పరారైన దుర్గాప్రసాద్‌ను క్రమశిక్షణా చర్యల ఉల్లంఘన కింద సస్పెండ్ చేస్తున్నట్లు డీజీపీ ఆర్పీ ఠాకూర్ సోమవారం వెల్లడించారు. ఈ మేరకు డీజీపీ కార్యాలయం నుంచి ఉత్వర్వులు వెలవడ్డాయి. పరారీలో ఉన్న డీఎస్పీ దుర్గా ప్రసాద్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles