robbery attempt at manikonda karur vysya bank బొమ్మ తుపాకీ తెచ్చి.. బ్యాంకు చోరికి యత్నించి..

Robbery attempt at manikonda karur vysya bank

karur vysya bank, manikonda branch, robbery attempt, theft attempt, toy gun, customers, bank staff, raidurgam police, cyberabad police, crime

A robber who entered manikonda karur vysya bank as a customer today at noon, then attempted for robbery with a toy gun.

మణికొండ కరూర్ వైశ్యా బ్యాంకులో చోరి యత్నం..

Posted: 10/29/2018 04:44 PM IST
Robbery attempt at manikonda karur vysya bank

హైదరాబాద్ లోని మణికొండలో ఓ దొంగ చేసిన హల్ చల్ కొద్దిసేవు అక్కడి కస్టమర్లను, బ్యాంకు సిబ్బందిని అందోళనకు గురిచేసింది. కొంతసమయం పాటు విస్మయానికి గురైన కస్టమర్లు, బ్యాంకు సిబ్బంది అగంతకుడి చేతిలోని తుపాకిని చూసి కంగారుపడ్డారు. అయితే అగంతకుడి చేతిలో వున్నది అసలు తుపాకి కాదని అది బొమ్మ తుపాకని అనుమానం కలిగిందో ఏమో.. అందరూ ఒక్కసారిగా దొంగకు ఎదురుతిరిగి ధైర్యం కూడగట్టుకున్నారు.

పోలీసులకు సమాచారం అందించి.. అగంతకుడిని అప్పగించారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వివరాలు ఇలా వున్నాయి.. మణికొండలోని కరూర్ వైశ్యా బ్యాంక్ బ్రాంచ్ లో ఓ దుండగుడు పట్టపగలే చోరీకి యత్నించాడు. బ్యాంక్ కస్టమర్ గా ఈరోజు మధ్యాహ్నం లోపలికి వెళ్లాడు. ఆ తర్వాత, తన వద్ద ఉన్న బొమ్మ తుపాకీతో బ్యాంకు సిబ్బందిని బెదిరించి డబ్బు తీసుకోవాలని ప్రయత్నించాడు. అప్పటివరకు దొంగకు అనుకూలంగా మారిన పరిస్థితులు ఒక్కసారిగా తిరగబడ్డాయి.

అగంతకుడి చేతిలో వున్నది అసలు తుపాకి కాదని అది బొమ్మ తుపాకని అనుమానం కలిగిందో ఏమో.. ఒక్కసారిగా బ్యాంకులోని కస్టమర్లు, సిబ్బంది అందరూ అతనిపైకి తిరగబడ్డారు. నిందితుడి తమ అధీనంలోకి తీసుకున్న వారు.. రాయదుర్గం పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో చోరీలకు పాల్పడాలన్న ఆలోచన వచ్చేవారికి ఓ గుణపాఠం కావాలని.. అందరూ ఇలా తిరగబడితే ఇక దొంగలు ఎవరూ బ్యాంకు చోరీలకు సహసించరని స్పష్టం చేసేలా చేసింది. ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles