Nandamuri Harikrishna's Last Letter To Fans పుట్టినరోజు నేపథ్యంలో అభిమానులకు హరికృష్ణ లేఖ

Nandamuri harikrishna s last handwritten letter to his fans

nandamuri harikrishna, nandamuri harikrishna dead, nandamuri harikrishna car crash, nandamuri harikrishna nalgonda, nandamuri harikrishna narketpally, nandamuri harikrishna janaki ram, nandamuri harikrishna jr.Ntr, andhra pradesh, Telanagana, kamineni hospital, Road accident, nalgonda, Khammam district, Junior NTR, crime

actor-politician Nandamuri Harikrishna penned a letter to all his fans recently where he mentioned that the fans should not celebrate his birthday and if they are planning any celebrations, they should use the money as a donation for Kerala flood relief activities.

పుట్టినరోజు నేపథ్యంలో అభిమానులకు హరికృష్ణ లేఖ

Posted: 08/29/2018 03:24 PM IST
Nandamuri harikrishna s last handwritten letter to his fans

నందమూరి హరికృష్ణ ఒక రాజకీయ నేతగా, ఒక సినీనటుడిగానే తెలుగు ప్రజలకు పరిచయమైనా ఆయన ఎన్నో స్వచ్ఛంగ సేవా కార్యక్రమాలకు కూడా ఆయన పెట్టింది పేరు. అయితే తాను చేసే ఎంతటి సేవా కార్యక్రమాలనైనా ఆయన గుప్తుదానం చేసి గమ్మునుంటారు. ప్రచారం, అర్భాటం చేయడానికి సేవ చేయడం, చిన్న సాయం చేసి పెద్దగా ప్రచారం ఎందుకని ఆయన పలు సందర్భాలలో పేర్కొన్నారు. తన దానాలు, సేవా కార్యక్రమాల వివరాలను ఆయన ఎంతో గోప్యంగా వుంచుతారని సమాచారం. ఈ సారి కూడా కేరళ సహా ఆంధ్రప్రదేశ్ జిల్లాలోని ప్రలు ప్రాంతాల్లో జలవిలయం అయిన నేపథ్యంలో ఆయన ఓ చక్కని నిర్ణయం తీసుకున్నారు.

అయన పరమపదించిన తరువాత ఆయన తన సొంత దస్తూరితో రాసిని ఈ లేఖ తనలోని ఔనత్యాన్ని చాటుతుంది. ఇంతకీ ఆయన ఆ లేఖలో ఏం రాశారంటే..? సెప్టెంబర్ 2న నందమూరి హరికృష్ణ పుట్టినరోజు. పుట్టినరోజుకు నాలుగు రోజులుండగానే ఆయన రోడ్డుప్రమాదంలో చనిపోయారు. పుట్టినరోజు వేడుకలు జరుపుకోవద్దంటూ మీడియా ద్వారా విజ్ఞప్తి చేసేందుకు ఆయన రాసిపెట్టుకున్న లేఖ ఒకటి బయటకు వచ్చింది. ఈ లేఖను ఆయన పుట్టినరోజుకు రెండురోజుల ముందు విడుదల చేయాలనుకున్నారు. కానీ… ఇంతలోనే హరికృష్ణ ఈ లోకం విడిచివెళ్లిపోయారు.

సెప్టెంబర్ 2తో ఆయనకు 62 ఏళ్లు పూర్తవుతాయి. కేరళతో పాటు.. ఆంధ్రప్రదేశ్ లో వరదలతో జనం ఇబ్బంది పడుతున్న వేళ తన పుట్టినరోజు జరుపుకోకూడదని హరికృష్ణ నిర్ణయించుకున్నారు. బ్యానర్లు, ఫ్లెక్సీలు, పుష్పగుచ్ఛాలు, దండలు తీసుకురావొద్దని విజ్ఞప్తి లేఖలో విజ్ఞప్తిచేశారు. శ్రేయోభిలాషులు, మిత్రులు, అభిమానులు అందరూ తన పుట్టినరోజుకు పెట్టే ఖర్చును వరద బాధితులకు పంపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దుస్తులు, వంటసామాగ్రి, నిత్యావసర వస్తువులను మీ శక్తిమేర కొనిచ్చి ఆదుకోవాలని పిలుపునిచ్చారు. ఆయన చివరి కోరిక అదే అని తెలియడంతో.. అభిమానులు కన్నీరుమున్నీరవుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nandamuri Harikrishna  Road accident  Jr  NTR  Kalyan Ram  Janaki Ram  Nalgonda  crime  

Other Articles