Sowmya Reddy wins Jayanagar for Congress ఉత్కంఠకర పోరులో గెలిచిన సౌమ్య.. పెరిగిన కాంగ్రెస్ బలం..

Congress sowmya reddy wins jayanagar seat

jayanagar election, jayanagar election results, jayanagar results, jayanagar winner, jayanagar election results 2018, jayanagar election result 2018, jayanagar by election, karnataka election result, karnataka election result 2018, jayanagar by election result, jayanagar by election results 2018, jayanagar by election result 2018, jayanagar by poll result, jayanagar by poll election result 2018, jayanagar up chunav result, Siddaramaiah, governor, vajubhai wala, Congress, BJP, JDS, Kumara Swamy, PM Modi, Amit shah, karnataka, politics

Congress candidate Sowmya Reddy has won from Jayanagar assembly constituency. Although Karnataka went to polls on May 12, elections in Jayanagar constituency was postponed to June 11, following the demise of BJP candidate B N Vijayakumar, who was holding the seat.

ఉత్కంఠకర పోరులో గెలిచిన సౌమ్య.. పెరిగిన కాంగ్రెస్ బలం..

Posted: 06/13/2018 12:46 PM IST
Congress sowmya reddy wins jayanagar seat

కర్ణాటకలో తామే అతిపెద్ద పార్టీగా అవతరించామని, తమకే ప్రజల మద్దతు వుందని బీరాలుపోయిన బీజేపికి.. ఆ తరువాత వచ్చిన రెండు నియోజకవర్గాల్లోని ఎన్నికల ఫలితాల్లో మాత్రం తన ఉనికిని కాపాడుకోలేకపోయింది. ఇక కాంగ్రెస్ మాత్రం తన బలం పెంచుకునే పనిలో సఫలం అయ్యింది. తాజాగా కర్ణాటక రాజధాని బెంగుళూరు పరిధిలోని జయనగర అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ పడిన మాజీ హోం మంత్రి రామలింగారెడ్డి కుమార్తె సౌమ్యా రెడ్డి ఘనవిజయం సాధించారు. బీజేపి సిట్టింగ్ సీటును అమె తన విజయంతో కాంగ్రెస్ ఖాతాలో వేశారు.

కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన సౌమ్యారెడ్డి 3,775 ఓట్ల తేడాతో తన సమీప బీజేపీ అభ్యర్థి ప్రహ్లాదపై విజయం సాధించారు. మొత్తం పోలైన ఓట్లలో సౌమ్యారెడ్డి 54,045 ఓట్లను పొందగా, బీజేపీ అభ్యర్థికి 50,270 ఓట్లు వచ్చాయి. ఇతరులంతా కలిసి 1,591 ఓట్లను మాత్రమే పొందగలిగారు. నగరంలోని నియోజకవర్గం కావడంతో నోటా కూడా వందకు పైగా ఓట్లు లభించాయి. ఇవాళ జరిగిన ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ నుంచి బీజేపిపై అధిక్యాన్ని కనబరుస్తూ వచ్చిన సౌమ్యా రెడ్డికి చివరి రెండు రౌండ్లు మాత్రం ఉత్కంఠకు గురిచేశాయి.

అప్పటి వరకు సుమారుగా పదివేల పైచిలుకు మెజారిటీ వున్న అమె అదిక్యత చివర్లోని రెండు రౌండ్లు తగ్గించాయి. అయితే చివరగా విజయం మాత్రం సౌమ్యారెడ్డినే వరించింది. కాగా, ఈ నియోజకవర్గంలో తమ పార్టీ అభ్యర్థి మరణంతో సానుభూతి ఓట్లను కూడా సంపాదించడంలో బీజేపి సఫలం కాలేకపోయింది. చివరకు సుమారు 4 వేల ఓట్ల మెజారిటీతో సౌమ్యా రెడ్డి విజయం సాధించడంతో కాంగ్రెస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ గెలుపుతో కర్ణాటక కాంగ్రెస్ ఖాతాలోకి మరో సీటు వచ్చి చేరడంతో కాంగ్రెస్ బలం 79కి చేరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Congress  Sowmya Reddy  jayanagar election  Ramalinga Reddy  Siddaramaiah  BJP  Congress  JD(S)  karnataka  politics  

Other Articles