Model Tweet Wiped Out Billion of Snap Market Value | ఆమె సింగిల్ ట్వీట్ తో 8 వేల కోట్లు నష్టం

Snapchat shares fall down with model tweet

Snapchat, Kylie Jenner, Kylie Jenner Tweet, Market Shares, Kylie Jenner Snapchat

Snapchat's parent company lost some $1.3 billion in market value on Thursday after reality star Kylie Jenner's tweeted that she was no longer using the messaging service.

స్నాప్ ఛాట్ కొంప ముంచిన ఒక్క ట్వీట్

Posted: 02/23/2018 03:44 PM IST
Snapchat shares fall down with model tweet

సోషల్ మీడియాలో సెలబ్రిటీల ప్రభావం ఎంతగా ఉంటుందో తెలియజేసే ఘటన ఇది. స్నాప్ ఛాట్ గురించి మోడల్ కైలీ జెన్నర్ చేసిన ట్వీట్ మార్కెట్ లో వాటి షేర్లు కుప్పకూలిపోవటానికి కారణమైంది. అది అలా ఇలా కాదు.. ఏకంగా 1.3 బిలియన్ డాలర్ల(మన కరెన్సీలో దాదాపు 8 వేల కోట్ల దాకా) నష్టం వాటిల్లింది.

రియాలిటీ స్టార్ కైలీ జెన్నెర్. స్నాప్ ఛాట్ కు గుడ్ బై చెప్పేదెవరు? నేననుకుంటున్నారా? అంటూ ట్వీట్ చేసింది. అంతే ఆ ట్వీట్ తన ప్రతికూల ప్రభావం చూపింది. మార్కెట్ లో షేర్లు ఒక్కసారిగా పడిపోయింది. అయితే కొద్ది నిమిషాలకే నా ఫస్ట్ లవ్.. నిన్ను వదిలే ప్రసక్తే లేదంటూ ఆమె చేసిన మరో ట్వీట్ ను ఎవరూ పట్టించుకోలేదు. గురువారం ఈ ట్వీట్ చేయగా స్పాన్ చాట్ పేరెంట్ కంపెనీ స్నాప్ ఐఎన్ సీ మార్కెట్ విలువ 1.3 బిలియన్ డాలర్లు (సుమారు రూ.8,300 కోట్లు) పడిపోయింది.

స్నాప్ ఐఎన్ సీ షేరు ధర ఆరు శాతానికి పైగా పతనమైంది. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కైలీ జెన్నెర్ కు సామాజిక మాధ్యమాల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఫోటో షేరింగ్ ప్లాట్ ఫామ్ అయిన స్నాప్ చాట్ 2017 డిసెంబర్ క్వార్టర్లో అమెరికా మార్కెట్లో ఫేస్ బుక్ కంటే ఎక్కువ మందిని ఆకర్షించింది. ఇన్ స్ట్రాగ్రామ్ తో పోటీ పడలేకపోతున్న స్నాప్ ఛాట్ లో మార్పులు చేయాల్సిందిగా యూజర్లు గత కొంత కాలంగా కోరుతున్నారు. అయితే అందుకు స్నాప్ ఛాట్ ఒప్పుకోవటం లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles