Donald Trump Secret Deal with Porn Star Revealed | పోర్న్ స్టార్ తో శారీరక సంబంధం.. సీక్రెట్ గా డీల్

Trump affair with porn star

Donald Trump, Porn Star, Stormy Daniels, Michael Cohen, Stephanie Clifford

American President Donald Trump lawyer brokered $130000 payment to porn star Stormy Daniels. Donald Trump Allegedly Paid Adult Film Star $130K To Keep Her Quiet About Affair.Michael Cohen, Trump's personal attorney, said the President "vehemently denies" the encounter, but did not address the alleged payment in a statement to CNN.

పోర్న్ స్టార్ తో ట్రంప్ సంబంధం.. డీల్

Posted: 01/13/2018 10:07 AM IST
Trump affair with porn star

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై మరో సంచలన ఆరోపణ. ఓ పోర్న్ స్టార్ తో ఆయనకు శారీరక సంబంధాలు ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని ఎక్కడా వెల్లడించకుండా ఉండేందుకు సదరు నటికి భారీ మొత్తంలో ట్రంప్ సొమ్ములు ముట్టజెప్పారని వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది.

స్టిఫానీ క్లిఫార్డ్ అనే అమెరికా జాతీయురాలు ఓ పోర్న్ స్టార్. 2006లో ఓ గోల్ఫ్ గేమ్ సందర్భంగా ట్రంప్ కు ఆమె పరిచయం అయింది. అదే సమయంలోనే మెలానియాను ట్రంప్ మూడో వివాహం చేసుకున్నారు. అయినప్పటికీ, స్టిఫానీతో ట్రంప్ శారీరక సంబంధం పెట్టుకున్నారు. అధ్యక్ష ఎన్నికల బరిలోకి ట్రంప్ దిగుతున్న సమయంలో, ఈ విషయం గురించి మాట్లాడేందుకు ఆమె ప్రయత్నించింది. దీంతో, విషయం బయటకు పొక్కకుండా చూసేందుకు మైఖెల్ కోహెన్ అనే లాయర్ కు ట్రంప్ బాధ్యతలను అప్పజెప్పారు.

ఈ నేపథ్యంలో, ఆమెకు ఏకంగా లక్షా ముప్పై వేల డాలర్లను ముట్టజెప్పి మ్యాటర్ క్లియర్ చేశారు మైఖేల్. విషయం బయటకు రానివ్వకుండా ఆమె వద్ద నుంచి హామీ కూడా తీసుకున్నారు. ఈ విషయాలను ఇప్పుడు వాల్ స్ట్రీట్ జర్నల్ బయటపెట్టింది. ఈ కథనాలను మైఖేల్ కొట్టిపారేయగా... స్టిఫానీ మాత్రం స్పందించలేదు. వైట్ హౌస్ మాత్రం ఇవన్నీ కట్టు కథనాలంటూ వ్యాఖ్యానించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles