miscreants manhandled RTC driver, conductor నగరంలో ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ పై దాడి.. నగదుతో పరారీ

Miscreants manhandled rtc driver conductor in hyderabad

unknown miscreants, miscreants manhandled, miscreants RTC driver, miscreants conductor, hungama in hyderabad, conductors money, miscreants loot money, miscreants vanished, miscreants abids, hyderabad police, crime

unknown miscreants manhandled RTC driver, conductor in hyderabad on pretext of not giving side, thereafter they loot money and vanished from the spot.

నగరంలో ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ పై దాడి.. నగదుతో పరారీ

Posted: 12/29/2017 07:15 PM IST
Miscreants manhandled rtc driver conductor in hyderabad

హైదరాబాద్‌లో న‌డిరోడ్డుపై కొంద‌రు యువ‌కులు రెచ్చిపోయారు. అనునిత్యం జనసంద్రంతో బిజీగా వుండే అబిడ్స్ లో నడిరోడ్డు మీద హంగామా చేసి.. ఏకంగా అర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్లలపై దాడికి పాల్పడారు. తమ కారుకే అడ్డువస్తారా అని కండక్టర్ వద్దనున్న డబ్బును పరిహారంమంటూ ఎత్తుకెళ్లారు. జరిగిన ఘటనతో బిత్తరపోయిన డ్రైవర్, కండక్టర్ లు  చేసేది లేక నేరుగా పోలీసులను అశ్రయించి పిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే..

గుర్తుతెలియని అగంతకులు న‌గ‌రంలోని అబిడ్స్‌లో వేగంగా కారు న‌డుపుతూ వ‌చ్చిన కొంద‌రు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు త‌మ వాహ‌నానికి అడ్డొచ్చిందంటూ ఓ ఆర్టీసీ బ‌స్సుని ఆపారు. తాము హార‌న్ కొడుతున్నా దారి ఎందుకు ఇవ్వ‌లేదంటూ ఆ బ‌స్సు డ్రైవర్, కండక్టర్‌పై దాడి చేశారు. అంతేకాదు, కండ‌క్ట‌ర్ వ‌ద్ద ఉన్న 9500 రూపాయ‌ల‌ను కూడా లాక్కెళ్లారు. ఈ ఘ‌ట‌న‌పై కండ‌క్ట‌ర్‌, డ్రైవ‌ర్ క‌లిసి అబిడ్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చ‌ర్య‌లు ప్రారంభించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : miscreants  TSRTC  Bus Driver  Conductor  Abids  hyderabad police  crime  

Other Articles