Man Shot Outside Bank For Resisting A Robbery Bid దేశరాజధానిలో పట్టపగలు దొంగల బరితెగింపు

Man shot outside bank for resisting a robbery bid

Malviya Nagar, Malviya Nagar Bank, Malviya Nagar Robbery, Shooting at malviya nagar, firing at malviya nagar, shooting at south delhi, shoot at kamaljeet singh, kamaljeet singh shot, petrol bunk owner, Delhi Police, crime

An elderly businessman was critically injured after he resisted a robbery attempt outside a bank in Malviya Nagar. The businessman, Kamaljeet Singh Sethi who owns a petrol pump in south Delhi

దేశరాజధానిలో పట్టపగలు దొంగల బరితెగింపు

Posted: 11/15/2017 03:42 PM IST
Man shot outside bank for resisting a robbery bid

దేశ రాజధానిలో దట్టమైన పొగమంచు అలుముకోవడంతో బారెడు పోద్దెక్కితే కానీ బయటకు వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయని ప్రజలు.. తమ చుట్టూ ఏం జరుగుతుందన్న విషయంపై కూడా అసలు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలను ఎదుర్కోంటున్నారు. గత కొన్ని నెలల క్రితం రోడ్డు ప్రమాదంతో క్షతగాత్రుడై పక్కన పడిపోయిన ఓ వ్యక్తిని కనీసం అపన్నహస్తం అందించేవారు లేకపోవడంతో ఉసూరుమంటూ అసువులు బాసిన విషయం తెలిసిందే.

ఇక తాజాగా జరిగిన ఘటనలో పట్టపగలు అందరూ చూస్తుండగా దారుణం చోటుచేసుకుంది. ఢిల్లీలోని మాలవీయ నగర్ లోని ఒక బ్యాంకులో డబ్బులు జమ చేయడానికి వస్తున్న స్థానిక పెట్రోల్ బంక్ యజమాని అయిన కమల్ జీత్ సింగ్ అనే వృద్దుడిని అనుసరించిన దుండగుడు బ్యాంకు ఎదుటే అటకాయించి అతని చేతిలోని బ్యాగును లాక్కునే ప్రయత్నం చేశాడు. అతని అరుస్తూనే.. బ్యాగును మాత్రం వదలకపోవడంతో.. నడి రోడ్డుమీద తుపాకీ చూపించి బెదిరించాడు. దుండగుడికి ఏమాత్రం భయపడని కమల్ జీత్ సింగ్ అతనితో తీవ్రంగా పోరాడాడు.

మరోవైపు సాయం చేయాలని బిగ్గరగానే అరిచాడు. బ్యాంకు నుంచి బయటకు వస్తూ.. అరుపులు విన్న అటో డ్రైవర్ కమల్ జీత్ సింగ్ ను రక్షించేందుకు ప్రయత్నించాడు. దుండగుడ్ని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ లోగా దుండగుడు వృద్దుడి భుజంపై కాల్పులు జరిపి బ్యాగుతో సహా పరారయ్యాడు. పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో జరిగిన ఈ ఘటనలో అటో డ్రైవర్ చెప్పిన వివరాలను తెలుసుకున్న పోలీసులు స్థానికంగా వున్న సిసిటీవీ ఫూటేజీని కూడా పరిశీలించారు. కాగా, గాయపడిన కమల్ జీత్ ను ఒక మహిళ ఆసుపత్రిలో చేర్పించగా అతని పరిస్థితి ఇంకా విషయమంగానే వుందని వైద్యులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : malviya nagar  robbery  shoot  elderly man  petrol pump owner  south delhi  delhi police  crime  

Other Articles