bhai dooj viral photo left everyone teary-eyed మనస్సుల్ని కదిలిస్తున్న అక్కతమ్ముల అనుబంధం..

Sister blessing her brother on bhai dooj has left everyone teary eyed

bhai dooj, bhai phonta, bhatriya ditiya, diwali celebratio, bhai dooj viral photo, disabled sis bhai dooj photo, bengal brother sister bhai dooj photos, viral news

On the occasion of Bhai Dooj, an elder sister went an extra mile to make sure loved brother receives her blessings and love. The sister, who is confined to a wheelchair, applied the chandan tilak on her younger brother’s forehead with her little toe instead of hands.

నెట్ జనుల మనస్సుల్ని కదిలిస్తున్న అక్కతమ్ముల అనుబంధం..

Posted: 10/24/2017 11:08 AM IST
Sister blessing her brother on bhai dooj has left everyone teary eyed

అన్నచెల్లిలి అనుబంధం జన్మజన్మలా పుణ్యఫలం అని తెలుగుసినీ కవి ఏ ముహుర్తాన ఎలాంటి సన్నివేశాన్ని ఊహించుకుని రాశారో తెలియదు కానీ.. అది అక్షరాల నిజమని తాజాగా అనేక ఘటనలు నిరూపిస్తున్నాయి. ఈ క్రమంలోనే దీపావళి పండుగ పర్వదినం మరుసటి రోజున బెంగాళీయులతో పాటు ఉత్తర భారతవాసులు.. బాయ్ దూజ్ పండుగను జరుపుకోవడం అనవాయితి. కుటుంబంలోని అడపడచులతో అన్యోన్యతను పెంచేడమే ఈ పండుగ పరమార్థం.

దక్షిణ భారతావనిలోని రమారమి అన్ని రాష్ట్రాల్లో రాఖీ పండ‌గకు వున్న ప్రాధాన్యత.. బెంగాలీయుల్లో మాత్రం భాయ్ దూజ్ కు వుంటుంది. అడపడుచులు అండగా మేమున్నామన్న ధైర్యానికి ప్రతీకగా రాఖీ పౌర్ణమిని జరుపుకుంటే.. అన్నదమ్ములు చల్లగా సుఖసంతోషాలతో వుండాలని భాయ్ దూజ్ పండగ జరుపుకుంటారు. అన్నా చెల్లెల్ల అనుబంధానికి, అక్కా తముళ్ల అనురాగానికి నిదర్శనంగా నిలుస్తుందీ పండుగ. ఇందుకు బెంగాలీ ఇతిహాసాలు కూడా దర్పణం పడుతున్నాయి.

ఈ పండుగ రోజున ఇంటి అడపడచులు తమ సోదరులకు నుదిటిన తిలకం దిద్ది.. వారు అయురారోగ్యాలతో కలకాలం సుఖసంతోషంగా ఉండాల‌ని ఆశీర్వదిస్తారు. ఈ సంద‌ర్భంగా ఇద్దరూ ఒక‌రికొక‌రు బ‌హుమ‌తులు, కానుక‌లు ఇచ్చిపుచ్చుకుంటారు. అలా కోల్‌క‌తాకు చెందిన స‌మ్రాట్ బ‌సు కూడా త‌న సోద‌రి వద్ద ఆశీర్వాదం తీసుకున్నాడు. అత‌డి నుదుట‌న ఆమె కాలి వేళ్లతో తిల‌కం దిద్ది, కాళ్లతోనే ఆశీర్వదించింది. అయితే కాళ్లతో అశీర్వదించిన ఆ ఫోటోలు నెట్టింట్లో సంచలనంగా మారాయి.

అంతేకాదు నెట్ జనుల మనస్సుల్ని కూడా ఈ ఫోటోలు కదిలిస్తున్నాయి. అయితే భాయ్ దూజ్ రోజున కాలితో అశ్వీరదించమేంటి..? అంటారా..? ఆమె రెండు చేతులు ప‌నిచేయ‌వు. దివ్యాంగురాలైన సోద‌రితో స‌మ్రాట్‌ ప్రతి ఏడాది భాయ్ దూజ్ పండ‌గ‌ను ఇలాగే జ‌రుపుకుంటాడు. పండ‌గ‌నాటి ఫొటోల‌ను స‌మ్రాట్ సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఫొటోలు చూసిన నెట్ జనులు క‌న్నీళ్ల ప‌ర్యంత‌మైన‌ట్లు చెప్పుకొచ్చారు. వారి అనుబంధం క‌లకాలం ఉండాల‌ని ఆశీర్వదించారు. ఒక ప‌క్క స‌మ్రాట్‌ని మెచ్చుకుంటూనే, సోద‌రిని జాగ్రత్తగా చూసుకోవాల‌ని సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles