India's first bullet train project: 350 km/hr top speed రైల్వేలో నవశకానికి నాంధి.. బుల్లెట్ రైలుకు శంకుస్థాపన

Bullet train is a big gift from japan to india says pm narendra modi

bullet train, high-speed bullet train, Mumbai-Ahmedabad, Narendra Modi, Shinzo Abe, 508 km, travel time, bullet train route, bullet train cost, bullet train speed, Gujarat, Piyush Goyal, Japan, Japanese prime minister

Prime Minister Narendra Modi along with Japanese Prime Minister Shinzo Abe today laid the foundation stone for the much-hyped Ahmedabad-Mumbai high-speed bullet train project.

రైల్వేలో నవశకానికి నాంది.. బుల్లెట్ రైలుకు శంకుస్థాపన

Posted: 09/14/2017 11:44 AM IST
Bullet train is a big gift from japan to india says pm narendra modi

దేశంలో రైల్వేశాఖలో నూతనోధ్యాయం లిఖించబడింది. ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు పనులకు ఇవాళ పునాదిరాయి పడింది. ప్రధాని నరేంద్రమోడీ, జపాన్ ప్రధాని షింజో అబేతో కలసి ఇవాళ బుల్లెట్ రైలుకు శంకుస్టాపన చేశారు. ప్రతిదేశానికి కలులు ఉండాలని.. వాటిని సాకారం చేసుకోవాలని ప్రధాని మోదీ అన్నారు. అహ్మదాబాద్‌లో బుల్లెట్‌ రైలు మార్గానికి శంకుస్థాపన అనంతరం ఆయన ప్రసంగించారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ నుంచి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు.

అహ్మదాబాదులో జరిగిన కార్యక్రమంలో వేదికపై నుంచి ఇరుదేశాల ప్రధానులు రిమోట్ కంట్రోల్ ద్వారా శిలాఫలకాలను ఆవిష్కరించి లాంఛనంగా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రధాని మోడీ భారత్‌ చిరకాల స్వప్నం త్వరలో సాకారం కానుందని ప్రధాని వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్టు ఉద్యోగాలను, వేగాన్ని, పర్యావరణ పరిరక్షణను, జపాన్‌ స్నేహాన్ని తీసుకువస్తుందని అన్నారు. ఇరుదేశాల మధ్య బలమైన స్నేహసంబంధాలకు ఇది నిదర్శనమని అన్నారు. ఈ ప్రాజెక్టులో ఎటువంటి ఇబ్బందులు రాకూడదని జపాన్‌ ప్రధాని అబే నిశ్చయించుకున్నారని మోడీ చెప్పారు.

పూర్వం నీటి మార్గం వున్న నదుల వద్ద నాగరికత ఉండేదని.. అది కాస్తా క్రమంగా జాతీయ రహదారులు వున్న ప్రాంతాలకు పాకిందని, దీంతో రహదారి కూడళ్ల వద్ద ప్రజలు నివసించారని.. ఇక ఇప్పుడు హైస్పీడ్ కారిడార్లు ఉన్నచోటే అభివృద్ధి ఉంటోందని ప్రధాని వివరించారు. రైల్వే లైన్లు వచ్చిన తర్వాతే అమెరికా అభివృద్ధి సాధించిందని అన్నారు. మన దేశం కూడా క్రమంగా హైస్పీడు వేగాన్ని అందుకుని దేశ అర్ధిక ప్రగతిని సాధిస్తుందని ఆయన అశాభావం వ్యక్తం చేశారు.

సాంకేతికతతో పేదల సాధికారతను అనుసంధానం చేస్తే.. పేదరికంపై విజయం సాధించినట్లేనని ప్రధాని అభిప్రాయపడ్డారు. మన దేశ రైల్వే సంస్థ చాలా పెద్దదన్న మోడీ.. అందులో ఒక వారం ప్రయాణించే మనవారి సంఖ్య.. జపాన్‌ మొత్తం జనాభాకు సమానమని చెప్పుకొచ్చారు. సగటు భారతీయుడికి మెట్రో రైలు ప్రయాణం అందుబాటులోకి తీసుకురావటమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు. ఈ భారీ ప్రాజెక్టు ద్వారా వేగవంతమైన రవాణా వ్యవస్థను నెలకొల్పటంతోపాటు ఉద్యోగాల కల్పన ఆస్కారం లభించదన్నారు.

ఈ బుల్లెట్ రైలు మానవహితంతో పాటు పర్యావరణహితంతో కూడకున్నదని.. ఇది మన జీవితాలలో కీలకంగా మారబోతుందని మోడీ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా షింజో అబే మాట్లాడుతూ భారత్, జపాన్ ల పరస్పర సంబంధాలు మరింత బలపడాలని కోరుకుంటున్నానని, ఇది శక్తివంతమైన జ‌పాన్‌, శక్తివంతమైన భారత్ లకు నాందిగా మారుతుందని చెప్పారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం ఇప్పటికే 100 మంది ఇంజినీర్లు జపాన్ నుంచి భారత్‌కు వచ్చినట్లు తెలిపారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్-జపాన్ కీలక భాగస్వాములని అబే చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bullet train  Mumbai-Ahmedabad  Narendra Modi  Shinzo Abe  Gujarat  Piyush Goyal  

Other Articles