Ten Years Imprisonment to ram rahim singh డేరా బాబాను వైరల్ చేస్తున్న నెట్ జనులు.. ఇక చెడుగుడే..

Should be jailed for life twitter reacts to ram rahim sentence

gurmeet ram rahim singh sentencing, twitter, facebook, socialmedia, gurmeet singh, ram rahim singh, gurmeet singh sentencing, dera sacha sauda, sunarial jail dera sacha sauda, haryana, punjab, panchkula, gurmeet ram rahim, panchkula photos, haryana violence photos, khattar, bjp, sirsa, latest news

Twitterati had unanimously agreed that a 10-year term was not enough to Gurmeet Ram Rahim Singh, they suggest that he should be awarded life-time.

డేరా బాబాను వైరల్ చేస్తున్న నెట్ జనులు.. ఇక చెడుగుడే..

Posted: 08/29/2017 11:26 AM IST
Should be jailed for life twitter reacts to ram rahim sentence

తన శిష్యురాళ్లపై అత్యాచారానికి పాల్పడిన ఆధ్యాత్మిక గురువు డేరా సచ్చా సౌదా ఛీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ఒక్కో అత్యాచారానికి గాను న్యాయస్థానం పదేళ్ల కఠిన కారాగార శిక్షను విధించి.. మొత్తంగా 20 ఏళ్ల జైలు జీవితంతో పాటు ఒక్కో బాధితురాలికి 14 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని తీర్పును వెలువరించడంపై నెట్ జనుల నుంచి హర్షం వ్యక్తమైంది. ఇక తీర్పును వెలువరించే సందర్భంగా న్యాయయూర్తి జగ్దీప్ సింగ్ రామ్ రహీమ్ సింగ్ మనిషి కాదు అడవి మృగం అని పేర్కోని.. అయనపై జాలిపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నెట్ జనులు కూడా ఈ విషయమై రేపిస్టు బాబాను చెడుగుడు అడుకుంటూ అంతర్జాలంలో సంచలనంగా మార్చేశారు.

పలువురు నెట్ జనులు అయనకు ఎందుకని తక్కువ శిక్షాకాలం విధించారు..? అయనకు జీవిత ఖైదు ఎందుకు విధించలేదని సామాజిక మాద్యమం ద్వారా ప్రశ్నలు కురిపిస్తున్నారు. ఇదే క్రమంలో సోషల్ మీడియా వేదికగా టీమిండియా క్రికెటర్ గౌతమ్ గంభీర్ కూడా స్పందిస్తూ న్యాయస్థానం తీర్పును మహిళల విజయంగా అభివర్ణించాడు.  ఎన్సీఆర్బీ 2015 గణాంకాల ప్రకారం, దేశంలోని అన్ని న్యాయస్థానాల్లో 1,37,458 రేప్ కేసుల విచారణ సాగుతోందని గుర్తు చేశాడు. ఆ కేసుల సంగతేంటని, వాటిని కూడా పరిష్కరించాలని అన్నాడు. ఇందుకోసం న్యాయస్థానాలు కృషి చేయాలని సూచించాడు.

ఇక మరికొందరు నెట్ జనులు మాత్రం ఆయనపై సెటైర్లు విసరుతూ కామెంట్లు పోస్టు చేశారు. గుర్మీత్ కు కేవలం రెండేళ్ల జైలు శిక్ష పడిందని.. అయితే మొత్తంగా పదేళ్లని ఒక్కో పేరు రెండేళ్ల చోప్పన న్యాయమూర్తి శిక్షను విధించారని పేర్కోన్నాడు. అదెలా విశ్లేషించాడంటే.. గుర్మీత్‌ కు-2 ఏళ్లు, రామ్‌ కు-2 ఏళ్లు, రహీమ్‌ కు-2 ఏళ్లు, సింగ్‌ కు-2 ఏళ్లు, బాబాకు-2 ఏళ్లు. ఇలా ఒక్కో పేరుకు రెండేళ్లు’ శిక్ష పడిందని వ్యాఖ్యానించారు.

మరో నెటిజన్ ‘అత్యాచారం కేసులో శిక్ష ఇప్పుడు ఖరారైంది. ఇక హత్య కేసులో తీర్పు రావాలి. ఇక బాబా జీవితం జైలుకే అంకితం’ అంటూ ఎధ్దేవా చేశాడు. ఇంకో నెటిజన్ ‘రాక్‌ స్టార్‌ లవ్‌ ఛార్జర్‌ ఇక మరో పదేళ్లు మనకు కనిపించడు.’ అన్నాడు. మరో నెటిజన్  ‘యే దస్‌ సాల్‌.. గుర్మీత్‌ కే నామ్‌’ అంటూ ఆసక్తికరంగా స్పందించాడు. మరొక నెటిజన్ అయితే ‘ఓ దొంగబాబాకు పదేళ్ల జైలు శిక్ష పడింది. ఇక నకిలీ బాబాలు జాగ్రత్త. ఇది మీకో హెచ్చరిక’ అంటూ దొంగ బాబాలందరికీ హెచ్చరికలు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles