teacher lesson to sarpanch husband who sexual harassed her కోరిక తీర్చాలన్న సర్పంచ్ భర్త.. ఇలా చేసిన టీచర్

Teacher lesson to sarpanch husband who sexual harassed her

anganwadi teacher, sexually assault on teacher, sexually haraassment on teacher, teacher lesson to sarpanch, rape, gangrape, anganwadi teacher sexually harassed, peddapalli teacher harassed sexually, sarpanch husband, moolasala village anganwadi teacher, telangana, crime

A Telangana teacher who was sexually harassed by sarpanch husband teaches a lesson to him by beating him with slipper in public, and approches police for case against him in moolasala village of peddapalli mandal.

కోరిక తీర్చాలన్న సర్పంచ్ భర్త.. ఇలా చేసిన టీచర్

Posted: 07/04/2017 01:41 PM IST
Teacher lesson to sarpanch husband who sexual harassed her

ఆయన ఏకంగా ఓ గ్రామానికి సర్పంచ్.. లాంటి వారు. ఎందుకంటే ఆయన భార్య సర్పంచ్ కాబట్టి. ఇంకేముంది ఆ గ్రామంలో ఆయన అడిందే అట.. పాడింతదే పాటగా చలమాణి అవుతుంది. తన అధికారాన్ని వినియోగించుకుని ఇలా సర్పంచుల భర్తలు అనేక దుర్వినియోగాలకు పాల్పడుతుంటారన్నది జగమెరిగిన సత్యమే. తాను చదవుకున్న మహిళనని, తనకు అంగన్‌వాడీ టీచర్‌గా ఉద్యోగం పెట్టించాలని సర్పంచ్ ను అశ్రయించిన ఓ మహిళకు సర్పంచ్ భర్త ఉద్యోగం కూడా పెట్టించాడు. ఇంతవరకు బాగానే వున్నా ఇక్కడే ప్రారంభబమైంది అసలు ట్విస్టు.

అమె అలా ఉద్యోగంలో చేరిందో లేదో.. ఇక అమెకు నరకం చూపించాడు సర్పంచ్ భర్త. ఏంటీ అంగన్ వాడీ టీచరుగా ఉద్యోగం అడిగావు.. పెట్టించాను.. మరి నా సంగతేంటీ.. మర్చిపోయావా..? లేక పట్టించుకోవడం లేదా..? ఉద్యోగం పెట్టించినవాడిని ఎలా ఊడబికాలో కూడా నాకు తెలుసు అంటూ బీరాలు పోయాడు. ఇంతకీ సర్పంచ్ భర్త ఏం అశిస్తున్నాడో తెలుసా..? ధనమో ధస్కమో అయితే ఉద్యోగం ఇప్పించినందుకు ఇచ్చే అంగన్ వాడీ టీచర్. కానీ సర్పంచ్ భర్త ఏకంగా అమెను తన కోరిక తీర్చాలంటూ వెంటపడ్డాడు.

దీంతో ఉద్యోగం వుంటే ఎంత..? లేకపోతే ఎంత..? అని భావించిన సదరు టీచర్ ఏకంగా సర్పంచ్ భర్తకు గట్టిగా బుద్ది చెప్పింది. తన చెప్పుతీసుకుని ఎడాపెడా వాయించింది. అంతటితో అగకుండా నేరుగా పోలిస్ స్టేషన్ కు వెళ్లి సర్పంచ్ భర్తపై పిర్యాదు కూడా చేసింది. ఈ ఘటన పెద్దపల్లి మండలం మూలసాలలో జరిగింది. గ్రామ సర్పంచ్‌ భర్త కొమురయ్య తనను లైంగికంగా వేధిస్తున్నాడని.. చాలా రోజులుగా తన కోరిక తీర్చాలంటూ వెంటపడుతున్నాడని ఆమె తన పిర్యాదులో పేర్కోంది. అతనిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు పిర్యాదు కూడా చేసింది.

దీంతో గ్రామ సర్పంచ్ భర్త కొమురయ్య తరపున పలువురు గ్రామ పెద్దలు రంగంలోకి దిగి అంగన్ వాడీ టీచర్ తో రాజీ కుదిర్చారు. ఇక సర్పంచ్ భర్త ఎప్పటికీ మీ జోలికి రాడని చెప్పారు. గ్రామపెద్దల సమక్షంలో కొమురయ్య కూడా ఇదే మాటను అంగీకరిస్తూ అమెకు హామి ఇచ్చాడు. మీ ఉద్యోగం మీరు చేసుకోండి.. అని పెద్దల సాక్షిగా చెప్పాడు. దీంతో బాధితురాలు మరోమారు పోలిస్ స్టేషన్ కు వచ్చి.. అంతకుముందు తానిచ్చిన పిర్యాదును ఉపసంహరించుకుంది. అయితే కొమురయ్య మాత్రం అంగన్ వాడీ కేంద్రానిను పాఠశాలలోకి మార్చినందుకే టీచర్ తనపై కక్షగట్టి దుష్ప్రచారం చేస్తోందని వాపోయాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rape  gangrape  moolasala  anganwadi teacher  peddapalli  sarpanch husband  telangana  crime  

Other Articles