meira kumar to begin campaign from sabarmati ప్రారంభమైన ట్విట్టర్ వార్.. సబర్మతి నుంచే ప్రచారం..

Will begin campaigning from sabarmati ashram says meira kumar

Meira Kumar, Opposition s presidential candidate, lok sabha speaker, Constitution club, sabarmati ashram, Presidential elections in india, meira kumar twitter, sushma swaraj, presidential elections, presidential polls, Pranab Mukherjee, ram nath kovind, pm modi, gujarat

Opposition's presidential candidate Meira Kumar said that she will begin her campaigning from Sabarmati Ashram. Asserting that democratic values, social justice, transparency, elimination of poverty are among the 'common ideology' shared by Opposition parties,

ప్రారంభమైన ట్విట్టర్ వార్.. సబర్మతి నుంచే ప్రచారం..

Posted: 06/27/2017 07:58 PM IST
Will begin campaigning from sabarmati ashram says meira kumar

రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థిగా లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరా కుమార్‌ పోటీ చేస్తోన్న నేపథ్యంలో అమె రేపు తన నామినేషన్ ను వేయనున్నారు. అనంతరం గుజరాత్ లోని సబర్మతీ ఆశ్రమం నుంచి తాను ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు అమె తెలిపారు. ఢిల్లీలోని కాన్టిట్యూషన్ క్లబ్ లో అమె విలేకరులు సమావేశంలో మాట్లాడుతూ.. 17 ప్రతిపక్ష పార్టీలు తనను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేశాయని వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రతీ భారతీయుడి జివితంలో సబర్మతీ ఆశ్రమం కీలకమైందని, ఒక్కసారి ఆ ఆశ్రమాన్ని సందర్శిస్తే ఎంతో శక్తి లభించినట్లు వుంటుందని తెలిపారు. అందుకనే అక్కడి నుంచే తన ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు.

పేదరిక నిర్మూలన, కుల వ్యవస్థల అధారంగా విభజన నిర్మూలన, పారదర్శక పాలన సాంఘీక న్యాయం, ప్రజాస్వామ్య విలువ పరిరక్షణ, ఇత్యాది అంశాలపై 17 ప్రతిపక్షాలు ఒక సంఘటిత నిర్ణయానికి వచ్చాయని, వాటినే తన ఎన్నకల ప్రచారస్త్రాలుగా మలుచుకుని వాటికి కట్టుబడి వుంటానని అమె చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికలలో ఇద్దరు దళిత అభ్యర్థుల మద్య పోటీ నెలకొనడంపై అమె హర్షం వ్యక్తం చేశారు. అయితే ఇదే సమయంలో మీడియా కులానికి ప్రాధాన్యతనివ్వడం పై అమె విచారం వ్యక్తం చేశారు.

స్పీకర్ గా వున్న కాలంలో తనపై ఏ ఒక్క ఎంపీ విమర్శలు చేయలేదని, తాను కూడా పారదర్శకంగా వున్నానని చెప్పారని, అయితే రాష్ట్రపతి ఎన్నికలలో అభ్యర్థిగా ప్రకటించడంతో అనవసర అరోపణలు చేస్తున్నారని అన్నారు. ఇలాంటి పుకార్లను నమ్మొద్దని చెప్పారు. రాష్ట్రపతి రేసులో తాను అభ్యర్థిగా నిలబడినా ఓడిపోతానని వస్తున్న విమర్శలను అమె తిప్పికొట్టారు. పోటీ అంటేనే ఇద్దరు అంతకన్నా ఎక్కువ అభ్యర్థులు బరిలో నిలిస్తేనే అంటారని, అందుకనే తాను బరిలో నిలుస్తున్నానని అన్నారు.

ప్రారంభమైన ట్విట్టర్ వార్

సోషల్ మీడియా ద్వారా ప్రజలకు మరింత చేరువగా ఉండేందుకుగాను మీరా కుమార్ పవిత్ర రంజాన్ రోజున ట్విటర్‌ ఖాతాను తెరిచారు. ఖాతా తెరిచిన 19 గంటల్లోనే ఆ ఖాతాకు 2,336మంది ఫాలోవర్లు చేరారు. క్రితం రోజు  సాయంత్రం ట్విటర్‌ ఖాతాను తెరిచిన మీరా ముస్లింలకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలుపుతూ మొదటి ట్వీట్‌ చేశారు. అనంతరం రాష్ట్రపతి ఎన్నికలపై తాజా సమాచారం కోసం తన ఫేస్ బుక్‌ ఖాతాని ఫాలో అవ్వాలని తెలుపుతూ అదే రోజు రెండో ట్వీట్ చేశారు.

ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా మీరా కుమార్ ను ప్రకటించిన అనంతరం కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌... 2013లో పార్లమెంటరీ సెషన్‌లో ప్రతిపక్ష నాయకులు మాట్లాడే సమయంలో స్పీకర్ మీరాకుమార్ ఏ విధంగా అడ్డు పడుతున్నారో చూడండి అంటూ ఓ వీడియోను పోస్టు చేశారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీ ఐఎన్‌సీ ఇండియా ట్విటర్ ఖాతా ద్వారా మీరాకుమార్ పై సుష్మాస్వరాజ్ పొగడ్తల వర్షం కురిపించిన వీడియోను పోస్టు చేశారు. దీంతో ఇరు పార్టీల అభ్యర్థులతో పాటు ఇరు పక్షాల మధ్యన కూడా వార్ నడుస్తుందని నెట్ జనులు అభిప్రాయపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles