Rajya Sabha MP Palvai Govardhan Reddy Died

Telangana mp palvai govardhan reddy died

Palvai Govardhan, Palvai Govardhan Died, Palvai Govardhan Death, Palvai Govardhan News, Palvai Govardhan Heart Attack, Palvai Govardhan Demise, Palvai Govardhan Sudden Death, Palvai Govardhan Heart Attack, standing committee meeting Kulu Manali, Palvai Govardhan Condolences, Rajya Sabha MP Death, Rajya Sabha MP Heart Attack, Palvai Govardhan Bio data, Palvai Govardhan Sonia Gandhi, Palvai Govardhan Modi Condolence, Congress MP Palvai Goverdhan Reddy, Rajyasabha MP Palvai, Rajya Sabha MP Palvai

Congres senior Leader, Rajya Sabha MP Palvai Govardhan Sudden Demise. Telangana MP Collapsed in car due to Heart Attack while going to Attaend Standing Committee Meeting at Kullu Manali.

కారులోనే గుండెపోటుతో ఎంపీ మృతి

Posted: 06/09/2017 11:03 AM IST
Telangana mp palvai govardhan reddy died

తెలంగాణ కాంగ్రెస్ కు పెద్ద షాకే తగిలింది. శుక్రవారం ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ పాల్వాయి గోవర్థన్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందాడు. స్టాండింగ్ కమిటీ సమావేశానికి హాజనయ్యేందుకు కులు మనాలి వెళ్లగా, అక్కడ కారులోనే ఆయనకు గుండెపోటు రావటంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వైద్యులు ఆయన చనిపోయినట్లు ధృవీకరించారు.

కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలకు సంబంధించి హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో ఈ సమావేశం జరుగుతుండగా, దీనికి ఆయనతోపాటు మరో 10 మంది ఎంపీలు కూడా అక్కడకు వెళ్లారు కూడా.ఆయన మృతి వార్త తెలియగానే కాంగ్రెస్ సీనియర్ నేతలంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

1936 నవంబర్ 1న మహబూబ్ నగర్ లో ఆయన జన్మించాడు. ఎమ్మెల్యేగా ఐదు సార్లు ఆయన పని చేయగా, 1967లో ఆయన తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2007 నుంచి 2009 దాకా మండలి సభ్యుడిగా ఆయన కొనసాగాడు. తర్వాత తెలంగాణ తరపున 2012 నుంచి రాజ్యసభకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణ ఓటమి తర్వాత అసంతృప్తికి లోనైన ఆయన సొంత నేతలపైనే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన సందర్భాలు అనేకం. ఫైర్ బ్రాండ్ గా ప్రత్యర్థులను ఏకీపారేయటంలో ఆయన దిట్ట. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajya Sabha Mp  Palvai Govardhan  Heart Attack  

Other Articles