Attempt to take selfie with Elephant goes wrong in Odisha

Selfie with wild elephant lands man in hospital

Odisha, Odisha Selfie, Elephant Selfie, Selfie with Elephant, Abhisekh Nayak Elephant, Elephant Trunk Selfie, Dangerous Selfie, Man Elephant Attck, Wild Elephant Trunk Slap Man

Tusker attacks man clicking selfie with herd in Odisha. The man identified as Abhisekh Nayak of Masania village in Dhenkanal district, has been admitted at a private hospital here with serious injury.

డేంజరస్ సెల్ఫీతో ఆస్పత్రిలో చేరాడు

Posted: 06/08/2017 01:09 PM IST
Selfie with wild elephant lands man in hospital

ప్రమాదకరమైన స్థితిలో ఫోటోల కోసం పిచ్చి అటెంప్ట్ లు చేసి ప్రాణాలు పొగొట్టుకున్న ఘటనలు దాదాపు రోజుకు ఒకటైనా ఎక్కడో చోట జరుగుతూనే ఉంటున్నాయి. రైల్వే పట్టాలు.. ఎత్తైన ప్రదేశాలు... నీళ్లు ఇలా వెతుక్కుని మరీ వెళ్లి ప్రమాదాల బారిన పడతున్నారు. సరిగ్గా అలాంటి ఘటనే ఇప్పుడు ఒడిషాలో జరిగింది. గజరాజుతో క్లిక్ కోసం సాహసం చేసి భారీ మూల్యం చెల్లించుకున్నాడు ఓ యువకుడు.

మసానియా గ్రామంలో అడవుల నుంచి వచ్చిన ఏనుగులు నానా భీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఊళ్లోవాళ్లు భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అధికారులు ఎంతగా యత్నిస్తున్నప్పటికీ వాటిని తరమి కొట్టడం వీలు కావట్లేదు. అయితే గ్రామానికి చెందిన అభిషేక్ నాయక్ అనే యువకుడి బుర్రలో మాత్రం ఓ పురుగు మెదిలింది. ఎలాగైనా ఏనుగు సెల్ఫీ దిగాలని ఆరాటపడ్డాడు.

అటుగా కొందరు ఓ ఏనుగును తరుముతుండగా, దాని దగ్గరకు వెళ్లి ఫోటో కోసం ట్రై చేశాడు. అప్పటికే చిర్రెత్తిపోయి ఉన్న ఏనుగు ఒక్కసారిగా తొండంతో అతన్ని విసిరి కొట్టింది. ఆపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. గ్రామస్తులంతా కలిసి కష్టపడి ఎలాగోలా ఏనుగు చెర నుంచి అభిషేక్‌కు విముక్తి కల్పించి, ఆస్పత్రిలో చేర్పించగా, ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇంతకు ముందు ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయన్నది తెలిసిందే. అయినా పైత్యంతో ఇలాంటి చేష్టలు చేసే వాళ్లు మాత్రం తగ్గట్లేదు. అందుకే ఏనుగుతో సెల్ఫీ ఏ మాత్రం వద్దన్నా...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Odisha  Selfie  Elephant Trunk  Hospitalized  

Other Articles