Brave Boy Escapes From Street Dogs బడుతడే గానీ అబ్బో వాడి సాహసం అదుర్స్.. వైరల్ వీడియో..

Brave boy escapes from street dogs attack

little master fight with street dogs, little master fight with stray dogs, little master chandu fight with street dogs, moosapet street dogs, viral video, stray dogs, chandu, pooja, srikakulam basti, anjaneya nagar, moosapet, GHMC, telangana

Street dogs usually frighten all including elderly people. But this little master fought bravely with street dogs without any fear in anjaneya nagar moosapet.

ITEMVIDEOS: బుడుతడే గానీ అబ్బో.. వాడి సాహసం అదుర్స్.. వైరల్ వీడియో..

Posted: 05/28/2017 02:52 PM IST
Brave boy escapes from street dogs attack

అర్ధరాత్రి. సమయం 12:40. చిన్నారులు పూజ- చందులు ఏవో కబర్లు చెప్పుకుంటూ ఇంటికి వెళ్తున్నారు. అర్థరాత్రి అందులోనూ అంతా నిర్మానుష్యంగా వుంది.. అయితేనేం తమకెవరు అడ్డుచెప్తారు.. అయినా ఇంటికేగా వెళ్తున్నాం అనుకున్నారో ఏమో తెలియదు కానీ.. అలా నడుస్తూ చిన్న గల్లీలోకి ప్రవేశించారు. ఉదయం పూట అందరూ వుండగానే అటుగా వెళ్లాలంటే భయపడే బస్తీలోకి పెద్దలు ఎవరూ లేకుండా ఇద్దరు బుడతలు మాత్రమే వస్తున్నారని గమనించిన నాలుగు గ్రామసింహాలు.. వారిని చూడగానే మీదకు దూసుకువచ్చాయి. ఇక కొద్ది దూరం నడిస్తే ఇల్లొచ్చేస్తుంది అనగా, ఈ ఘటన వారికి ఎదురైంది. అయితే ప్రమాదాన్ని పసిగట్టిన పూజ.. క్షణంలో పారిపోయింది. చందుకు మాత్రం కుక్కలు ఆ ఛాన్స్‌ ఇవ్వలేదు. దూసుకొచ్చి చుట్టుముట్టాయి.
 
పెద్దవాళ్లుసైతం గజగజా వణికిపోయే ఆ పరిస్థితిలో చందూ సాహసం ప్రదర్శించాడు. కుక్కలను ఎదిరించి పారిపోబోయాడు. అటుగా వచ్చిన మరో శునకం అతడ్ని అడ్డుకుంది. ఇక తెగింపే లక్ష్యంగా వాటిపైకి తిరగబడ్డాడు. బడతడే కదా అనుకున్న కుక్కలు.. అతడి ధైర్యసాహసాల ముందు తోకముడిచాయి. అంతే అక్కడి నుంచి నెమ్మెదిగా.  సురక్షితంగా తప్పించుకుని చాకచక్యంగా తప్పించుకున్నాడు. హైదరాబాద్‌లోని మూసాపేట్‌లో చోటుచేసుకున​ ఈ సంఘటన.. స్థానికంగా ఒకరి ఇంట్లో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయింది.

మూసాపేట్‌లోని శ్రీకాకుళం బస్తీలో శనివారం రాత్రి ఓ పెళ్లి జరిగింది. పెళ్లింటి నుంచి రెండు వీధుల అవతలుండే సొంతింటికి వెళ్లే క్రమంలో చందు, పూజలు ఇలా ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురానికి చెందిన కృష్ణ కుమారుడు చందు తన వీరోచితాన్ని ప్రదర్శించి వీధికుక్కల నుంచి దాడి నుంచి తప్పించుకోగలిగాడు, బంధువుల పెళ్లికి వచ్చిన చందు తన సాహసంతో పెళ్లింట ఎలాంటి విషాధం చోటుచేసుకోకుండా చేయడంతో అతడ్ని అందరూ మెచ్చుకుంటున్నారు. కాగా వీధి కుక్కల భారి నుంచి తమకు రక్షణ కల్పించాల్సిందిగా స్థానికులు పలుమార్లు అధికారులను వేడుకున్నా స్పందిచడంలేదు. చందు సాహసం చేశాడు కాబట్టి సరిపోయింది లేకపోతే పెళ్లింట విషాదం చోటుచేసుకునేదని ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరి వారు స్పందిస్తారో లేదో వేచిచూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : viral video  stray dogs  chandu  pooja  srikakulam basti  anjaneya nagar  moosapet  GHMC  telangana  

Other Articles