Swathi Suicide Case Missing Naresh killed Brutually

Yadadri love story end as tragedy

Yadadri Love Story, Naresh Missing, Missing naresh Murdered, Naresh Brutually Murdered, Naresh Body Found, Swathi Naresh Love Story, Naresh Killed, Swathi Parents Kill Naresh, Naresh Death Mystery, Nalgonda Naresh Death, Swathi Suicide Case

Yadadri Love Story ends tragedy. After Swathi Suicide Missing Naresh Dead Body Found. Killed him brutally and torched.

షాకింగ్ ట్విస్ట్: యాదాద్రి జంట కేసు విషాదం

Posted: 05/27/2017 10:44 AM IST
Yadadri love story end as tragedy

సంచలనం సృష్టించిన యాదాద్రి జంట కేసులో షాకింగ్ ట్విస్ట్. కనిపించకుండా పోయిన స్వాతి భర్త నరేశ్ శవమై కనిపించాడు. స్వాతి పొలంలోనే అతన్ని దారుణంగా నరికి చంపి, ఆపై టైర్లతో తగలబెట్టి దుండగులు పూడ్చేశారు. దీంతో ఆ ప్రేమ జంట కేసు తీవ్ర విషాదంగా మారింది.

కనిపించకుండా పోయిన నరేష్ ను కనిపెట్టాలంటూ జూన్ 1 డెడ్ లైన్ తో హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్పీ స్థాయి అధికారితో విచారణ కొనసాగగా దర్యాప్తులో నిప్పులాంటి నిజం బయటపడింది.

 


యాదాద్రి జిల్లాకు చెందిన తుమ్మల స్వాతి రెడ్డి, అంబోజి నరేష్ లు ప్రేమ వివాహం చేసుకోవటం, ఆపై ముంబై పారిపోయి తిరిగి ఎవరి ఇళ్లకు వాళ్లు చేరటం. కట్నం కోసం నరేష్ తల్లిదండ్రులు తనని టార్చర్ పెట్టారంటూ సూసైడ్ కు ముందు సెల్పీ వీడియోలో చెప్పిన విషయాలు తెలిసిందే. ఇక తన కొడుకు కనిపించటం లేదంటూ నరేష్ తండ్రి వెంకటయ్య హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేయగా, అతని ఆచూకీ కనిపెట్టాలంటూ కోర్టు ఆదేశించింది.

ప్రస్తుతం స్వాతి మరణం వెనుక కోర్టు అనుమానాలను వ్యక్తం చేయటంతో దానిని కూడా చేధించే పనిలో పడ్డారు పోలీసులు. నివేదిక సిద్ధమైనప్పటికీ బహిర్గతం చేయొద్దంటూ కోర్టు ఆదేశాలివ్వటంతో గోప్యంగా ఉంచుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Swathi Suicide Case  Naresh Missing  Dead Body Found  

Other Articles