ఎర్రబుగ్గ కార్లతో అధికారదర్పం చాటుకుంటున్న వారికి చీటి చెల్లింది. సరిగ్గా కార్మిక దినోత్సవం రోజు నుంచి అమల్లోకి రానున్న నూతన ఉత్వర్వులతో ఇక ఎర్రబుగ్గ కార్లు కనిపించవు. ఒక్క రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడా కనిపించావు. అంబులెన్స్, పోలీసు సహా ఇతర ఎమర్జెన్సీ సర్వీసులు మాత్రం గతంలో మాదిరిగానే నీలిబుగ్గలను మాత్రమే వినియోగించాలి. మే 1 నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి. కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం వీవీఐపీల సంస్కృతికి, ఎగ్రబుగ్గల సంప్రదాయానికి చరమగీతం పాడింది.
అయితే దేశ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్ సభ స్పీకర్ మినహాయించి వీటిని ఎవరూ వాడకూడదని ఉత్తర్లులలో పేర్కోంది. కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులతో పాటు గవర్నర్లు సహా అనేక మంది ఈ ఎర్రబుగ్గకార్లను వినియోగించేవారు. అయితే తాజాగా వచ్చిన ఉత్తర్వులతో ఇక వీరెవరూ ఎర్రబుగ్గకార్లను వినియోగించలేరు. ఇకపై ఎరుపురంగు బుగ్గకార్ల వినియోగంపై ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలతో స్వయంగా ప్రధాన మంత్రే ఎర్రబుగ్గల కారు వినయోగాన్ని కొల్పోతున్నారు.
కాగా 2002, 2005లో కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ల ప్రకారం రాష్ట్రపతి, ప్రధానమంత్రి, భారత ప్రధాన న్యాయమూర్తి, కేబినెట్ మంత్రులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, త్రివిధ దళాల అధిపతులు ఎర్రబుగ్గ వాహనాలు వాడొచ్చు. అయితే నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా ఎర్రలైటు వాహనాలను ఉపయోగించేవారికి భారీగా జరిమానాలు విధించేలా మోటారు వాహనాల చట్టానికి సవరణలు తేవాలని సూచించాలంటూ సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. నీలిరంగు బీకర్లను అంబులెన్స్, పోలీసులు మాత్రమే అత్యవసర సమయాల్లో ఉపయోగించాలని సుప్రీంకోర్టు గతంలో సూచనలు చేసిన విషయం తెలిసిందే. అయితే కేంద్రం నిర్ణయంతో ఇక ఎర్రబుగ్గల కార్లు కనిపించవు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more