దేశం పరువు తీసిన ఇద్దరు భారతీయ అమెరీకన్లు.. Two Indian-Americans sentenced for credit card fraud in US

Two indian americans sentenced in 200m credit card fraud scheme

Indian-Americans sentenced, Vijay Verma, Tarsem Lal, jersey City, Raja jewelry store, indo americans credit card fraud scheme, $200M credit card fraud scheme, indians sentenced in america, indian americans, sentence, credit card fraud scheme, crime

Two Indian-Americans in the US have been sentenced to over a year of imprisonment for a massive international credit card fraud involving more than USD 200 million.

కటకటాల వెనక్కి భారతీయ అమెరీకన్లు..

Posted: 03/28/2017 11:05 AM IST
Two indian americans sentenced in 200m credit card fraud scheme

ఏ దేశమేగినా ఎందుకాలినా పోగడరా నీ తల్లి భూమి భారతిని.. నిలుపరా నీ జాతి నిండు గౌరవము అంటూ రాయప్రోలు చెప్పిన మాటను అలకించినట్టు లేరు.. కేవలం ధనార్జనే పరమావధిగా రాత్రికి రాత్రి కుభేరులు కావాలని కలలు కంటూ వక్రమార్గం పట్టిన ఇద్దరు భారతీయ అమెరీకన్లు చిట్టచివరకికి దేశం కానీ దేశంలో ఊచలు లెక్కబెడుతున్నారు. రెండు వందల మిలియన్ డాలర్ల క్రెడిట్ కార్డు కేసులో మోసానికి పాల్పడిన ఇద్దరు భారతీయ అమెరికన్లకు అక్కడి న్యాయస్థానం కారగారశిక్షను విధించడంతో పాటు ఐదు వేల రూపాయల జరిమాను కూడా విధించింది.

న్యూజెర్సీలోని జెర్సీ పట్టణంలో రాజా జెవలెర్స్ పేరున వీరిద్దరు బంగారు అభరణాల వ్యాపారం చేస్తున్నారు. 2013లో వీరిద్దరు కలసి వక్రమార్గంలో డబ్బులు సంపాదించేందుకు పథకం వేశారు. ఆ ఫతకంలో భాగాంగా దాదాపు 7వేల తప్పుడు అడ్రస్ లను సృష్టించడంతో పాటు వాటికి అనుగూణంగా అడ్రస్ ప్రూఫ్ లను కుడా సృష్టించారు. వీటితో వేల సంఖ్యలో క్రెడిట్ కార్డులు రాబట్టి వాటి ద్వారా పెద్ద మెత్తంలో మోసానికి పాల్పడ్డారు. తప్పుడు అడ్రస్ లతో క్రెడిట్ కార్డులు తీసుకోవడంలో మోసమేముంది అంటారా..?

ఇలా వారు పొందిన తప్పుడు క్రెడిట్ కార్డులతో వారు షాపింగ్ చేశారు. అది ఎక్కడో బయట కాదు.. తమ దుకాణంలోనే. తప్పడు అడ్రస్ లపై తీసుకున్న క్రెడిట్ కార్డుల మొత్తం (అదే నండి క్రెడిట్ లిమిట్ మొత్తం) తమ దుకాణం ఖాతాల్లోకి వచ్చేలా అన్నింటిని స్వైప్ చేశారు. ఇలా దాదాపుగా 200 మిలియన్ డాలర్లను తమ ఖాతలో జమచేసుకున్నారు. క్రెడిట్ కార్డుదారులు ఎంతకీ తమ రుణాలను చెల్లించకపోవడంతో అనుమానం వచ్చిన సంస్థలు దర్యాప్తు అధికారులకు విషయాన్ని తెలిపారు.

దీంతో విచారణ జరపిని పోలీసులకు షాకింగ్ విషయం తెలిసింది. దుకాణ యజమానులే తప్పుడ అడ్రస్ లను, ఐడీ ప్రూఫ్ లను సృష్టించి మోసానికి పాల్పడ్డారని తేలింది, దుకాణ యజమానుల బండారం బయటపడటంతో వారిని అరెస్టు చేసిన దర్యాప్తు బృందాలు వారిని న్యాయస్థానాలకు తరలించగా, విజయ్‌ వర్మ(49), తర్సీం లాల్‌(78) లకు మొత్తం 14 నెలల జైలు శిక్ష విధించింది. దీంతో పాటు వీరిద్దరికీ ఐదు వేల డాలర్ల జరిమానా కూడా విధించింది. శిక్షాకాలం తరువాత 12 నెలల పాటు ఇంటిలోనే వుండాలని కూడా న్యాయస్థానం అదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : indian americans  sentence  credit card fraud scheme  Vijay Verma  Tarsem Lal  crime  

Other Articles