అఖిలేష్ ఇజ్జత్ కా సవాల్.. రేపిస్ట్ మంత్రిని కాపాడుకోలేడా? | Akilesh is appealing to Gayatri Prajapati to surrender.

Amit shah slams up cm akhilesh yadav

BJP President Amit Shah, CM Akilesh Yadav, Uttar Pradesh Ache Din, Amit Shah Akilesh Yadav, Gayatri Prajapati, Gayatri Prajapati Rape Case, Akilesh Yadav Gayatri Prajapati, UP Minister Rape, Akilesh Yadav March 11. Akilesh Yadav Resignation

BJP President Amit Shah dig at UP CM Akilesh Yadav. In a Election Campaign Says Uttar Pradesh's 'achche din' will start from March 11 and Akilesh ready with resignation letter. 'CM is appealing to Prajapati to surrender; under BJP government, he will be arrested'

అఖిలేష్... రాజీనామాకు రెడీనా?

Posted: 03/04/2017 07:38 AM IST
Amit shah slams up cm akhilesh yadav

సెమీఫైనల్స్ గా భావిస్తున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమరం చివరి దశకు చేరుకుంది. ఎవరికి వారు విజయం తమదేనంటూ ప్రకటనలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా చేసిన ఓ ప్రకటన చేశాడు. మార్చి 11న రాజీనామా లేఖతో అఖిలేష్ యాదవ్ సిద్ధంగా ఉండాలంటూ ఆయన పిలుపునిచ్చాడు.

సమాజ్‌వాదీ పార్టీ ఓటమి ఖాయమని ఇప్పటికే తేలిపోయిందని, ముఖ్యమంత్రి రాజీనామా తథ్యమని జోష్యం చెబుతున్నాడు. కేంద్రంలో రెండున్నరేళ్ల మోదీ పాలనకే యూపీ ప్రజలు పట్టం కడతారని చెబుతున్న అమిత్ గుండా రాజ్యంతో ఇక్కడ ప్రజలు విసిగి వేశారిపోయి ఉన్నారంటూ చెబుతున్నాడు. ప్రజలంతా అఖిలేష్ తమను రక్షిస్తాడని ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఆయన గారేమో రేప్ కేసులో ఉన్న తమ నేతలను రక్షించుకునే పనిలో ఉన్నాడంటూ ఆరోపణలు గుప్పించాడు.

మార్చి 11 లోగా అత్యాచార ఆరోపణలు ఎదుర్కుంటున్న మంత్రి గాయత్రి ప్రజాపతిని గనుక అరెస్ట్ చేయకపోతే, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కటకటాల వెనక్కి పంపి తీరతామంటూ చెప్పుకొచ్చాడు. ఇక యూపీలో గెలుపుతో పట్టుపెంచుకోవాలని చూస్తున్న బీజేపీ ఇక్కడ గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతోంది. మరో రెండు విడతల ఎన్నికలు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలోనే తీవ్ర ఆరోపణలతో ఎస్పీపై విరుచుకుపడుతుంది. మరోవైపు కాంగ్రెస్‌తో జతకట్టిన ఎస్పీ విజయం తమదేనని ధీమాతో ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : UP Elections  BJP President  Amit Shah  Akilesh Yadav  Gayatri Prajapati  

Other Articles