కారు నేర్చుకుంటూ.. పిల్లలను చంపేసింది | While car learning woman kills brothers.

Mumbai woman driving kills two children

Mumbai woman Driving, car learning woman, army man and his wife, Lance Naik Santoshkumar Rai Sangeeta, Cycle siblings killed, Army children accident, Driving killed

Woman Learning driving crushes 2 Young Siblings in Mumbai.

బ్రేక్ బదులు యాక్సిలేటర్ తొక్కి చంపేసింది

Posted: 12/14/2016 09:41 AM IST
Mumbai woman driving kills two children

అనుభవరాహిత్యం ఒక్కోసారి పెను ప్రమాదాలకు దారితీస్తుందని నిరూపించే ఘటన ఇది. ఓ మహిళ సరదా ఇద్దరు చిన్నారుల ప్రాణాలు బలిగొన్న ఘటన ముంబైలో జరిగింది. వారిద్దరు అన్నదమ్ములు కావటంతో ఆ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి.

వివరాల్లోకి వెళ్లితే.. 34 ఏళ్ల సంగీత కొత్త కారుతో తనకు డ్రైవింగ్ నేర్చుకోవాలని ఉందని భర్తకు చెప్పటంతో లెర్నింగ్ లైసెన్స్ లేకపోయినా ఆమె సరదా తీర్చేందుకు భర్త, లాన్స్ నాయక్ సంతోష్ కుమార్ రాయ్(36) ప్రయత్నించాడు. వీరుంటున్న నేవీ నగర్ లోని సువిధ కాంప్లెక్స్ లోనే కారు నేర్పించేందుకు సిద్ధపడ్డాడు.

అయితే నెమ్మదిగా కారు తోలుతుండగా సైకిల్ నేర్చుకుంటున్న ఓ ఇద్దరు పిల్లలు ఎదురొచ్చారు. కంగారు పడిపోయిన సంగీత, బ్రేక్ బదులుగా యాక్సలేటర్ తోక్కటంతో అక్షాంన్ష్(13), అభయ్(7) ల మీదుగా పోనిచ్చింది. అంతే కారు వారిని ముందుకు ఈడ్చుకుంటూ వెళ్లి ఓ చెట్టును ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దీంతో జనం భారీ ఎత్తున్న గుమిగూడగా, అటుగా వెళ్తున్న లాన్స్‌నాయక్ రవీంద్ర జాదవ్ పోలీసులకు సమాచారం అందించాడు. పిల్లల్లో ఒకరిని జాదవ్ ఐఎన్ఎస్ అశ్వని ఆస్పత్రికి తీసుకెళ్లగా మరొకరిని నిందితురాలి భర్త తీసుకెళ్లారు. అయితే అరగంటకే వారిద్దరూ చనిపోయారని వైధ్యులు తెలిపారు.

కాగా, వీరిద్దరూ కూడా ఆర్మీ ఆఫీసర్ పిల్లలే కావటం గమనార్హం. అస్సాంలో అతను విధులు నిర్వహిస్తుండగా, ముగ్గురు పిల్లలతో ఆ తల్లి సువిధ కాంప్లెక్స్ లో ఉంటోంది. రెండో కొడుకు కూడా సోదరులతో ఆడుకుంటూ... ఘటన జరిగిన పది నిమిషాల క్రితమే వెళ్లిపోవటంతో అతని ప్రాణాలు నిలిచాయి. ఇక నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు ఆపై 15వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసి విడుదల చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Woman Driving  killed siblings  Mumbai  

Other Articles