ఆస్పత్రిలో ఉన్నప్పటికీ సేవాగుణం మానలేదు | Sushma Swaraj responding to tweet seeking visa help.

Hospitalized sushma is still helping the public

Sushma Swaraj, Sushma Swaraj hospitalized, Sushma Swaraj AIIMS, Sushma Swaraj helping nature, Sushma Swaraj social media, Sushma Swaraj chinamma, Sushma Swaraj external minister, Sushma Swaraj news, Sushma Swaraj visa help, Sushma Swaraj geetha, Sushma Swaraj Kidney transplantation,

Sushma Swaraj is ill in hospital, but still helping the public a huge social media thumbs-up.

ఈ పరిస్థితిలో కూడా చిన్నమ్మ ఏం చేసిందంటే..

Posted: 12/05/2016 04:11 PM IST
Hospitalized sushma is still helping the public

కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సేవా గుణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమకు సాయం కావాలంటూ ఎవరైనా ఓ ట్వీట్ చేస్తే చాలూ, వెంటనే రియాక్ట్ అయిపోయి.. ఆ వెంటనే సాయం చేసి మరీ ఇంకో ట్వీట్ పెట్టేస్తుంది.

ప్రస్తుతం ఆమె రెండు కిడ్నీలు చెడిపోవటంతో ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఆరోగ్యం పూర్తిగా పాడైపోయిందన్న స్పృహ ఆమె ఆలోచనల్లోనే లేదు. ఈ క్రమంలో సాయ గుణం మాత్రం మరవటం లేదు.

20 రోజులుగా కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో ఉన్న ఆమె, తన సాయం కోరేవారిని ఆదుకుంటూనే ఉన్నారు. ఎయిమ్స్ లోనే పనిచేస్తూ, ఆస్ట్రేలియాకు వీసా కోరుకున్న గీత అనే పీహెచ్డీ స్కాలర్, సుష్మ సాయాన్ని కోరగా, ఆమె స్పందిస్తూ, "గీతా... నేను కూడా ఎయిమ్స్ లోనే ఉన్నాను. నా దగ్గరకు రా. నాకు చేతనైనంత సాయం చేస్తాను" అని ట్వీట్ చేశారు.

 

ఎయిమ్స్ లో పీహెచ్డీ చేస్తున్న గీతా సింగ్, ఈ నెల 7న ఆస్ట్రేలియాలో జరిగే ఓ సమావేశంలో తన అధ్యయనాన్ని సమర్పించాల్సి వుండగా, ఆమెకు వీసా లభించలేదు. దీనిపై ఆమె సాయం కోరుతూ సుష్మను ఉద్దేశించి ట్వీట్ పెట్టగా, సుష్మ సహృదయంతో స్పందించింది. అయితే ఈ పరిస్థితుల్లో కూడా ఆమెను ఇబ్బంది పెట్టలా? అంటూ గీతను కొందరు విమర్శించగా, అదేం తప్పు కాదంటూ వీసా కన్ఫర్మ్ అయినట్లు స్వరాజ్ మరో ట్వీట్ వేసింది.  ఏది ఏమైనా చిన్నమ్మ చేసిన ఈ పనికి గౌరవం మరింత పెరిగిందంటూ ట్వీట్లు పడుతున్నాయి.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sushma Swaraj  AIIMS  Australia Visa  Help  

Other Articles