ఏకానమీ సర్జికల్ స్ట్రైక్ తో ప్రధాని ఛాతి కుంగిపోయిందా..? Anand Sharma asks PM, Who Wants To Kill You

Anand sharma asks pm in parliament who wants to kill you

Anand Sharma,Parliament,Currency ban,Notes Ban,Prime Minister Narendra Modi, demonetisation, parliament session, congress, rbi rules, pm modi demonetisation, demonetisation rules, rbi demonetisation, atm demonetisation, atm waiver, atm withdrawal, atm withdrawal charges, india news

In ongoing parliament session Congress leader Anand Sharma demanded that PM Narendra Modi explain his comments alleging a threat to his life.

ఏకానమీ సర్జికల్ స్ట్రైక్ తో ప్రధాని ఛాతి కుంగిపోయిందా..?

Posted: 11/16/2016 02:02 PM IST
Anand sharma asks pm in parliament who wants to kill you

అవినీతిపై పోరాటంలో దేనికి వెనుకాడనని ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ ఛాతీ ఏకానమీ సర్జికల్ స్ట్రైక్ తరువాత కుండిపోయిందా..? అని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఆనంద్ శర్మ ప్రశ్నించారు. పెద్దనోట్ల రద్దుతో తనను చంపాలని చూస్తున్నారని మోదీ అంటున్నారు... ఎన్నికల సందర్భంగా చూపిన తన 56 అంగుళాల ఛాతీ ధైర్యం ఏమైందని ఆయన నిలదీశారు. ప్రధానిని చంపేవారు దేశంలో ఎవరున్నారు? అని ఆయన ప్రశ్నించారు. టీవీ ముందుకు వస్తే చాలు, నోటికేది వస్తే అది మాట్లాడుతున్నారని రాజ్యసభలో ఆయన మండిపడ్డారు.

ప్రతిసారి ప్రధాని త్యాగం చేశాను, త్యాగం చేశాను అంటున్నారు. అన్నీ త్యాగం చేసిన వ్యక్తి ఎవరి డబ్బులతో విదేశీ పర్యటనలు చేస్తున్నారని నిలదీశారు. త్యాగాల సూక్తులు ప్రజలకు చెప్పి.. వారి ధనంతో సౌకర్యాలు పొందుడం నిజం కాదా..? అని అడిగారు. గంగానదిలో కొట్టుకొస్తున్న వెయ్యి రూపాయల నోట్లన్నీ నల్ల కుబేరులవేనంటున్నారు... అవన్నీ సాధువులవేనని ఎందుకు గుర్తించడం లేదు?' అని ఆయన ప్రశ్నించారు. ప్రధాని ఏకపక్షంగా కొంత మందికి మాత్రమే తెలిసేలా తీసుకున్న నిర్ణయంతో తండ్రులు కుమార్తెలకు వివాహం చేసుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, వివాహాలు రద్దు చేసుకుంటున్నారని, ఆసుపత్రుల్లో శవాలు కూడా బయటకు రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

నల్లధనం నియంత్రణకు అంతా తామే చేసినట్టు గొప్పలు చెప్పుకోవద్దని ఆయన బీజేపీ నేతలకు సూచించారు. నల్లధనం నియంత్రణకు గతంలో ఉన్న ప్రభుత్వాలన్నీ ఎన్నో చర్యలు తీసుకున్నాయని అన్నారు. అందులో భాగంగానే తాము మనీ ల్యాండరింగ్ యాక్ట్, ఫెరా నిబంధనలు ఇలా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని ఆయన చెప్పారు. వాటి ఆధారంగానే ఇప్పటికీ నల్లధనాన్ని నియంత్రిస్తున్నారన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 500, 1000 రూపాయల నోట్ల రద్దుతో నల్లధనం అంతమైపోతే... 2000 రూపాయల నోటు ఎందుకని ఆయన నిలదీశారు. 2000 నోటు ప్రవేశపెట్టడం ద్వారా నల్లధనంపై కేంద్రం వ్యూహం ప్రజలకు అర్థమవుతుందని, దీనికితో మరింత అవినీతికి తెరలేస్తుందని ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు.

బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలో చిత్రమైన పరిస్థితి నెలకొందని ఆనంద్ శర్మ అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడినా వారిని దేశ వ్యతిరేకులుగా మీరు చిత్రీకరిస్తున్నారు. మీ ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపినా.. వారిపై కూడా అదే ముద్ర వేస్తున్నారని దుయ్యబట్టారు. దీంతో ప్రధాని మాత్రమే దేశంలో మాట్లాడుతున్నారని.. కనీసం విపక్షాల మాటలు వినేందుకు కూడా ప్రధాని సభకు రాలేదని ఆయన అన్నారు. ఆయన గదిలో కూర్చుని మాట్లాడితే మాత్రం అందరూ చూడాలి.. విపక్షాలు చెప్పే మాటలను మాత్రం నేను వినను అంటే.. పార్లమెంటుకు ఆయనిచ్చే విలువ అవగతం అవుతుందన్నారు.

అధికారంలో ఉన్నాం కనుక దేశం మాది, మాకు నచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటాం అంటే మాత్రం చూస్తూ ఊరుకుంటామని అనుకోవద్దని ఆయన హెచ్చరించారు. నగదురహిత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడుంది? అని ఆయన ప్రధానిని నిలదీశారు. దేశాన్ని మొత్తం దోచేశారంటున్నారు. మీకు గత ప్రభుత్వం ఖాళీ ఖజానా ఇచ్చిందా? అని ఆయన నిలదీశారు. గతంలో దేశాన్ని కేవలం రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ మాత్రమే పాలించారా? మొరార్జీదేశాయ్, చరణ్ సింగ్, వీపీ సింగ్, చంద్రశేఖర్, అటల్ బిహారీ వాజ్ పేయి వీళ్లంతా దేశాన్ని దోచేశారా? అని ఆయన నిలదీశారు. టీవీలో కనిపిస్తున్నామనగానే పూనకం వచ్చినట్టు ఊగిపోతారని, ఏం మాట్లాడుతారో కూడా అర్ధం కావడం లేదని ఆనంద్ శర్మ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles