మోదీ తల్లి వర్సెస్ కేజ్రీవాల్ తల్లి ! | PM Modi shouldn't have made his mother stand in a line, says Arvind Kejriwal.

Kejriwal says pm modi using his mother for politics

Arvind Kejriwal, Narendra Modi, Heeraben Modi, Kejriwal Mother vs Modi Mother, kejriwal Mother, Geetha Devi, Geetha Devi Heeraben Modi, Mother Politics, Kejriwal about Modi Mother, Modi Mother note exchange, Modi mother in queue

Arvind Kejriwal gets trolled for saying PM Modi shouldn't have let his mother stand in queue.

తల్లి రాజకీయాలపై మాటల తుటాలు

Posted: 11/16/2016 07:51 AM IST
Kejriwal says pm modi using his mother for politics

పాత నోట్ల వ్యవహారం వంకతో మోదీపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విరుచుకుపడుతూనే ఉన్నాడు. ఓవైపు దేశం మొత్తం రోజంతా బ్యాంకుల వద్ద, ఏటీఎంల వద్ద గడుపుతూ తీవ్ర అవస్థలు పడుతుంటే, మోదీ పైశాచిక ఆనందం పొందుతున్నాడంటూ ఘాటు వ్యాఖ్యలే చేశాడు. ఇప్పుటిదాకా ఇబ్బందులు పడుతుంది సామాన్యులేనని, నల్లధనం ఉన్నవారు కాదంటూ చెబుతున్నాడు. కనీసం తల్లి కోసం మోదీ లైన్ లో కూడా నిల్చొలేడా అంటూ ట్విట్టర్ లో విమర్శించాడు.

రద్దయిన 500, 1000 రూపాయల నోట్లు మార్చుకునేందుకు మోదీ తల్లి మంగళవారం హీరాబెన్ గుజరాత్ లోని గాంధీనగర్ లో ఉన్న ఓరియంటల్ బ్యాంకు వ‌ద్దకు తన సహాయకులతో వచ్చి క్యూలో నిల్చోని మరీ మార్చుకున్న విషయం తెలిసిందే. ఆ ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి కూడా. మోదీ తీసుకున్న నిర్ణయంలో తల్లికి కూడా మినహాయింపు లేదని నిరూపించాడని అంతా పొగడ్తలతో ముంచెత్తారు. అయితే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆ అంశాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.

 

ప్రధాని నరేంద్ర మోదీ 96 ఏళ్ల తల్లిని క్యూలైన్లో నిలబెట్టి రాజకీయాలు చేయడాన్ని మానుకోవాలని హితవు పలికారు. ఒకవేళ తనకు ఆ పరిస్థితి వస్తే...తన తల్లి బదులుగా ఆ క్యూ లైన్లో తానే నిలబడతానని తెలిపాడు. మరోవైపు తాను మోదీ లాంటి వాడిని కాదని, అందుకే ఆమె తల్లిపై వ్యాఖ్యలు చేయనని రాహుల్ గాంధీ కూడా స్పందించాడు.

ఇక దీనిపై సోషల్ మీడియాలో కూడా వ్యంగ్యోక్తులు వ్యక్తమయ్యాయి. ఎనిమిది మంది సహాయకుల సాయంతో బ్యాంకుకు వెళ్లే బదులు, వారిలో ఎవరో ఒకర్ని పంపిస్తే ఆ డబ్బులు తెచ్చిచ్చేవారు కదా? అని కొందరు, సీఎం కావడానికి 80 ఏళ్ల తల్లి(గీతాదేవి)తో కేజ్రీవాల్ ధర్నాలు చేయించాడని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానించడం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PM Narendra Modi  Delhi CM Kejriwal  Note Exchange  Heeraben Patel queue  

Other Articles