నటి శ్రీయ.. ఆ క్రికెటర్ తో డేటింగ్..? Shriya Saran spotted on a secret lunch date with bravo

Shriya saran spotted on a secret lunch date with bravo

dj bravo,shriya saran, Dwayne bravo dating, bravo shriya dating, bravo shriya secret lunch, bravo shriya dating and lunch, bravo shriya mumbai, bravo shriya hotel, bravo shriya gossips

Dwayne found time to have a secret lunch date with South hottie Shriya Saran. Aha! And the shutterbugs spotted them. She looked hot in a short jumpsuit while Dwayne rocked the causal look.

నటి శ్రీయ.. ఆ క్రికెటర్ తో డేటింగ్..?

Posted: 10/13/2016 09:55 PM IST
Shriya saran spotted on a secret lunch date with bravo

ధక్షిణాది సినీనటి శ్రీయా శరణ్‌.. ఆ మధ్య తన టాలెంట్ ను బాలీవుడ్ లోనూ చాటుకుంది. 15 ఏళ్ల క్రితం తన సినీ కెరీర్ ను ప్రారంభించిన శ్రియ ఇప్పటికీ కీలక పాత్రలను దక్కించుకుంటోంది. కెరీర్‌ ప్రారంభించినప్పుడు ఎలా ఉందో.. ఇప్పటికీ అదే గ్లామర్‌ను మెయింటెన్‌ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. సుదర్ఘీ కెరీర్‌లో ఎవరితోనూ ఎఫైర్‌లు, బ్రేకప్‌లు లేకుండా గడిపేసిన ఈ బ్యూటీ.. ఇన్నాళ్లకు ప్రేమలో పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఫేమస్ క్రికెటర్ తో అమ్ముడు డేటింగ్ లో కూడా పాల్గోంటుందన్న ఫుకార్లు గుప్పుమంటున్నాయి. 

అ క్రికెటర్ తో కలసి అమ్ముడు లంచ్ కోసం ఓ హోటల్ కు వెళ్లడంతో అది కాస్తా కెమెరా కంటపడింద. అంతే శ్రియ ప్రేమలో పడిందోచ్ అన్న వార్తలు గుప్పుమంటున్నాయి. వీరిద్దరూ కలసి ముంబూలోని ఓ హోటల్ కు లంచ్ కోసం వెళ్తున్న క్రమంలో మీడియాలో న్యూస్ గుప్పుమంది.  అయితే ఇంతకీ ఎవరా క్రికెటర్ అంటారా...?వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌, డ్యాన్సింగ్‌ క్రికెటర్‌ డ్వేన్‌ బ్రావోతో శ్రియ లవ్‌ట్రాక్‌ నడుపుతోందనే వార్తలు పుట్టుకొచ్చాయి. 
 
విండీస్‌ క్రికెటర్‌ అయినప్పటికీ భారత్‌ అంటే బ్రావోకు ఎంతో ఇష్టం. ఐపీఎల్‌తోపాటు బాలీవుడ్‌ సినిమాల్లో నటిస్తూ, పాటలు పాడుతూ, ఓ హిందీ రియాల్టీ షోలో పాల్గొంటూ ఇండియాతో అనుబంధాన్ని కొనసాగిస్తున్నాడు. తాజాగా శ్రియ, బ్రావో డేటింగ్‌లో ఉన్నారని బాలీవుడ్ మీడియా అంటోంది. ముంబై శివార్లలోని ఓ రెస్టారెంట్‌కు తరచుగా వెళ్తుంటారని తెలుస్తోంది. ఇటీవల వారిద్దరూ ఆ రెస్టారెంట్‌ నుంచి బయటకు వస్తూ మీడియా కంటికి చిక్కారు. ఫొటోగ్రాఫర్లు తమ కెమెరాలకు పనిచెప్తున్నా వారు డోంట్‌కేర్‌ అన్నట్టు వ్యవహరించారు. దీనితో వారిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలకు మరింత బలం చేకూరింది. అది నిజమో, కాదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dj bravo  shriya saran dating  lunch  mumbai hotel  

Other Articles