ఆయన ఎవరైనా ఆపండయ్యా | AK Antony Hits Out At Parrikar

Former defence minister ak antony hits out at parrikar

AK antony Manohar Parrikar, Manohar Parrikar AK Antony, Antony Hits Out At Parrikar , Surgical Strikes full credit to Modi

Former Defence Minister AK Antony Hits Out At Parrikar over Surgical Strikes comments.

ఆర్మీకి అవమానం: ఇప్పుడు పారికర్ వంతు!

Posted: 10/13/2016 09:18 PM IST
Former defence minister ak antony hits out at parrikar

సర్జికల్ దాడుల క్రెడిట్ అంతా ప్రధాని నరేంద్ర మోదీ ఖాతాలోనే వేసిన రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ఇప్పుడు విమర్శలు ఎదుర్కుంటున్నాడు. ఇప్పటిదాకా తమ నేతలు సంజయ్ నిరుపమ్, మరో సీనియర్ నేత చిదంబరం లాంటి వాళ్ల వ్యాఖ్యలతో తమను ముప్పుతిప్పలు పెట్టిన కమలాన్ని ఆడుకునేందుకు పారికర్ కామెంట్లను వాడుకుంటుంది. ఆయన ఇండియన్ ఆర్మీని, దేశాన్ని అవమానించారని మాజీ రక్షణ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ మండిపడ్డారు.

సర్జికల్ స్ట్రయిక్స్ క్రెడిట్ మొత్తం ప్రధాని మోదీకి చెందుతుందని వ్యాఖ్యానించడం ద్వారా సైన్యాన్ని, దేశాన్ని పారికర్ అవమానించారని అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో మెరుపుదాడులు జరగలేదని ఆయన చెప్పడాన్ని ఆంటోనీ ఖండించారు. పారికర్‌ ను ఎవరైనా నియంత్రించాలని ఆయన సూచించారు. ఆయన వ్యాఖ్యలు చాలా బాధ కలిగించాయని పేర్కొన్న ఆయన, పారికర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని తెలిపారు.

బుధవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న పారికర్ ఇప్పటిదాకా జరిగిన బెస్ట్ దాడుల్లో ఈ సర్జికల్ ఎటాక్ బెస్ట్ అంటూ వ్యాఖ్యానించాడు. అంతేకాదు కాంగ్రెస్ ఈ విషయంలో రాజకీయాలు చేయటం మానలంటూ హితవు కూడా పలికాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Congress Leader  Former Defence Minister  AK antony  Manohar Parrikar  

Other Articles