నట్టనడివీధిలోని డిస్ ప్లే బోర్డుపై ఆ చిత్రాలా..? Porn film plays on Jakarta billboard

Porn film plays on jakarta billboard

Jakarta, Videotron, Porn video, Social media, Indonesia, Traffic jam, Reactions, viral news, viral video, bangkok, thailand, southeast asia, crimes, investigative report, asean, bangkok

An explicit pornographic video was broadcast on a public billboard in broad daylight in Jakarta, with police and cyber crime specialists searching for the culprit behind the gaffe.

ITEMVIDEOS: నట్టనడివీధిలోని డిస్ ప్లే బోర్డుపై ఆ చిత్రాలా..?

Posted: 10/02/2016 08:36 AM IST
Porn film plays on jakarta billboard

పట్టపగలు నట్టనడి వీధిలో ఆ చిత్రాలు చూసిచూడగానే ట్రాఫిక్ జామ్ అయ్యింది. అది కూడా రద్దీ సమయం కావడంతో ట్రాఫిక్ మరింతగా జామ్ కావడానికి కారణమైంది. ఏంటా చిత్రాలు.. అయినా రోడ్డుపైన ఆ చిత్రాలు అంటున్నారు.. రోడ్డుపైన ధియేటర్లు ఎలా కట్టారన్న సందేహాలు కూడా వస్తున్నాయి కదూ. అయితే అక్కడికే వస్తున్నాం. రోడ్డు పక్కన, కూడళ్లలో ఉండే బిల్‌బోర్డుల (డిజిటల్‌ స్క్రీన్‌లపైలో వాణిజ్య ప్రకటనలు వస్తునే వుంటాయి. అయితే వాటిని చూసీ చూడనట్టుగానే నగరజనం తమ ప్రయాణాలను సాగిస్తూవుంటారు. సాధ్యమైనంత త్వరగా తమ గమ్యస్థానాలకు చేరాలని భావస్తుంటారు.

అయితే యధావిధిగా శనివారం కూడా ట్రాఫిక్ తమ గమ్యాలకు చేరేందుకు వేగంగా వెళ్తుంది. అలా వెళ్తున్న వాళ్లు బిల్ బోర్డులను చూస్తూ తమ వాహనాల వేగనియంత్రణను చేశారు. రమారమి వాహనాలు నిలిచిపోయేంత పని జరిగిపోయింది. ఇక మరికోందరి బిల్‌బోర్డుపై వస్తున్న దృశ్యాలు చూసి మూర్ఛవచ్చినంత పనైంది. ఆ దృశ్యాలను చూస్తూ ప్రజలు బిత్తరపోవడంతో ట్రాఫిక్‌ జామ్‌ అయింది. ఈ ఘటన  ఇండోనేషియా రాజధాని జకర్తాలో పట్టపగలు జరిగింది.

అది కూడా అత్యంత రద్దీగా రోడ్డు వుండే సమయంలో ఓ బిల్‌బోర్డుపై పోర్న్‌ దృశ్యాలు ప్రసారమయ్యాయి. ఈ శృంగార దృశ్యాలను చూసి వాహనదారులు షాక్‌ తిన్నారు. కొద్దిసేపు ఆ దృశ్యాలు ప్రసారమైన తర్వాత పవర్‌ కట్‌ అయింది. భారీ ట్రాఫిక్‌ జామ్‌లో ఆ దృశ్యాలను చూసిన వాహనదారులు చాలామంది.. వాటిని తమ సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పెట్టారు. ఈ దృశ్యాలు ఇప్పుడు వైరల్‌గా మారిపోయాయి. 'వీడియో ట్రోన్‌' సంస్థ ఏర్పాటు చేసిన బిల్‌బోర్డులో ఈ షాకింగ్‌ దృశ్యాలు ప్రసారమయ్యాయి. దీంతో వీడియోట్రోన్‌ హ్యాష్‌ట్యాగ్‌తో ఈ దృశ్యాలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఎవరో అకతాయులు హ్యాక్‌ చేసి ఈ దృశ్యాలను ప్రసారం చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. దుండగులను పట్టుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jakarta  Videotron  Porn video  Social media  Indonesia  Traffic jam  Reactions  viral news  viral video  

Other Articles