నా పెళ్లానికి ఏడుగురు మొగుళ్లు | Bengaluru Man Complains His Wife Married 7 Others

Bengaluru man complains his wife married 7 others

Bengaluru Man Complains His Wife, Bengaluru Wife seven marriages, wife cheated husbands with several marriages, Wife several marriages, One Wife Seven Husbands, Husbands Que for complaint on wife , Yasmin Bhanu, yasminbhanu husbands, woman serial marriages, bangalore woman several marriages

Bengaluru Man Complains His Wife Married 7 Others.

వింత కేసు : అతని భార్యకు ఏడుగురు భర్తలు!

Posted: 09/20/2016 12:43 PM IST
Bengaluru man complains his wife married 7 others

సరైన వార్త అంటే ఇది. తన భార్యకు ఏడుగురు భర్తలు ఉన్నారని, తనను మోసం చేసిన ఆమె నుంచి తనను కాపాడాలంటూ ఓ భర్త పోలీసులను ఆశ్రయించడం కన్నా ఏముంటుంది చెప్పండి. బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి భార్య పెట్టే టార్చర్ పైనే కాదు, ఆమె ఏకంగా ఏడు పెళ్లిలు చేసుకుందని చెబుతున్నాడు. నగరంలోని కేజీహళ్లి ప్రాంతానికి చెందిన ఇమ్రాన్ ప్రస్తుతం ఈ విషయమై పోలీసులను ఆశ్రయించాడు..

ఇమ్రాన్ యాస్మిన్‌భాను తో మూడేళ్ల క్రితం వివాహం కాగా, ప్రస్తుతం కేజీహళ్లిలో నివాసం ఉంటున్నారు. అయితే యాస్మిన్ అతని కంటే ముందు ఆమె ఏడుగురిని పెళ్లిచేసుకుందని, రోజూ హింసిస్తోందని వాపోయాడు ఇమ్రాన్. ఆమె ఆగడాల నుంచి తనను కాపాడి న్యాయం చేయాలని కోరాడు. మగవాళ్లను మోసం చేయడమే పనిగా పెట్టుకున్న యాస్మిన్ తనపై రోజూ దాడి చేస్తోందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఇమ్రాన్ ఫిర్యాదు తర్వాత మరో ఇద్దరు కూడా ముందుకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. యాస్మిన్ తమను కూడా మోసం చేసిందంటూ షోయబ్, అఫ్జల్‌లు తెలిపారు. యాస్మిన్ తనను పెద్దమొత్తంలో డబ్బులు అడిగిందని, ఇవ్వనని చెప్పడంతో వదిలి వెళ్లిపోయిందని అఫ్జల్ పేర్కొన్నాడు. ఒక నారి ఏడు తుపాకుల వ్యవహారంలో పోలీసులు ఆచితూచి స్పందిస్తున్నారు. ఆమెపై దాడి కేసు నమోదు చేశారుగానీ, పెళ్లి మగాళ్లను మోసం చేసిన ఆరోపణలపై మాత్రం కాస్త వెనుకంజ వేస్తున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bangalore  Wife  Seven Marriages  Complaint  

Other Articles