విరిగిన మెట్రో ఫిల్లర్ తెలంగాణది కాదన్న కేటీఆర్ | KTR tweet on Metro Pillar crack was actually in Pak

Ktr tweet on metro pillar crack was actually in pak

KTR tweet on Metro Pillar, fake metro pillar not in telangana, telangana metro pillar, fake news telangana metro pillar, metro pillar crack, pak metro pillar crack

KTR tweet on Metro Pillar crack was actually in Pakistan, says call on people beware of fake news.

ఫేక్ ఫోటోపై స్పందించిన కేటీఆర్

Posted: 08/03/2016 11:14 AM IST
Ktr tweet on metro pillar crack was actually in pak

ఆకతాయిల పుణ్యమాని ఆన్ లైన్ ఫేక్ ఫోటోలు హల్ చల్ చేస్తుండటం, ముందు వెనకా ఆలోచించకుండా అవి నిజమని నమ్మి ప్రజలు ఆందోళన చెందడం ఈ మధ్య బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా మత వ్యవహారాలు, రాజకీయాలకు సంబంధించి సున్నితమైన అంశాల్లో తప్పుడు ఫోటోల వల్ల అల్లర్లు, ఉద్రిక్తస్థాయి పరిస్థితులు మరియు ప్రాణ నష్టం నెలకొన్న దాఖలాలు చాలానే ఉన్నాయి. ఈ క్రమంలో తెలంగాణకు సంబంధించిన ఓ ఫోటో ఈ మధ్య నెట్ లో బాగా వైరల్ అయ్యింది.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మెట్రో ప్రాజెక్టు లో నాణ్యత లోపాలున్నాయంటూ కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో వదంతులను సృష్టించారు. ఇందుకు సంబంధించి గచ్చిబౌలి దగ్గర మెట్రోఫిల్లర్ విరిగిపోయిందటూ ఏకంగా ఓ ఫోటోను పెట్టి దాన్ని బాగా వైరల్ చేశారు. అయితే ఇది అక్కడ ఇక్కడా పాకి చివరికి తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ కంట పడింది. మరి ఆయన ఊరుకుంటారా?

అదసలు మన దేశంలోనిదే కాదంటూ సాక్ష్యాలతో సహా ట్విట్టర్ లో ఓ ఫోటోను ఉంచారు. పిల్లర్ విరిగిపోయి ప్రమాదకర స్థితిలో ఉంది పాకిస్థాన్ లోని రావల్పిండికి చెందింది. అది మెట్రో ప్రాజెక్టుది కాదు అంటూ ఓ సందేశాన్ని పేర్కొన్నారు. ప్రజలు ఇలాంటి వదంతులను నమ్మొద్దని, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  metro pillar  crack down  pakistan  KTR  tweet  

Other Articles