Digvijay Singh taken aback after seeing his name in BPL list

Digvijay singh taken aback after seeing his name in bpl list

Digvijay Singh BPL, diggi raja twitter, MP BJP Digvijay singh, non tax payer digvijay singh

Digvijay Singh taken aback after seeing his name in BPL list. BJP says he was mentally poor.

డిగ్గీరాజా దారిద్ర్యం గురించి తెలుసా?

Posted: 07/23/2016 05:11 PM IST
Digvijay singh taken aback after seeing his name in bpl list

కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ ‘దారిద్ర్యం’ వ్యవహారం ఇప్పుడు హస్తం-కాషాయం మధ్య మాటల యుద్దానికి కారణమయ్యాయి. దారిద్ర్యపు రేఖ దిగువన (బీపీఎల్) జాబితాలో దిగ్విజయ్ సింగ్ కుటుంబం పేరు నమోదు కావటంతో ఆయన మండిపడ్డారు. గోవా కాంగ్రెస్ కమిటీ సమావేశానికి శుక్రవారం హాజరయిన ఆయన స్థానిక మీడియా ద్వారా విషయం తన దృష్టికి రాగానే  ట్విట్టర్ వేదికగా విమర్శలకు దిగారు.

మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా తన పేరును, తన సోదరుడు, తన కుమారుడి పేర్లను బీపీఎల్‌ జాబితాలో చేర్చాయని దిగ్విజయ్‌ సింగ్ ఆరోపించారు. దురుద్దేశంతో ఇలా ప్రభుత్వాలు ఇలా చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను బీపీఎల్‌ జాబితాలో చేర్చమని తామెన్నడూ దరఖాస్తు చేయలేదని, దాని నుంచి రావాల్సిన ఎలాంటి ప్రయోజనాలు పొందలేదని, అయినా సరే కావాలని తమను బీపీఎల్ జాబితాలో చేర్చారని, ఇది తమ కుటుంబ ప్రతిష్ఠను దిగజార్చడమేనని, ఇందుకు బాధ్యులైన వారు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

దీనిపై ఈరోజు బీజేపీ స్పందించింది బీపీఎల్ లో కుటుంబాలను సంప్రదించాకే అధికారులు పేర్లు నమోదు చేస్తారు. అంటే దిగ్విజయ్ సింగ్ కుటుంబ సభ్యుల ప్రమేయం లేకుండా ఆయన పేరు నమోదు కాదు.  ఒకవేళ పొరపాటున జరిగిన అది కింది స్లాయి ఉద్యోగుల తప్పు. అందుకు ప్రభుత్వాలను విమర్శించడం విడ్డూరం. కానీ, ఒకటి మాత్రం ఒప్పుకోవాల్సిందే. డిగ్గీరాజా మెంటల్లీ పూర్(మానసిక స్థితి సరిగ్గాలేని వ్యక్తి) అని పార్టీ ప్రతినిధి ఒకరు తెలిపారు.  కాగా,గత కొన్నేళ్లుగా ఆదాయ పన్నులన్నీ సక్రమంగా చెల్లించట్లేదనే ఫిర్యాదు దిగ్విజయ్ సింగ్ పై ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Madhya Pradesh  Government  BJP  BPL list  Digvijay singh  family  Congress  

Other Articles