B’luru delivery boy held for seeking sexual favours from customer after tiff over order

Delivery boy seeks sex from customer after order dispute

food delivery boy, sexually harassment, woman, whatsapp, bengaluru, karnataka, delivery, boy, harassment, abuse. woman, escort, JP Nagar police, McDonald, sexual favours,SD Sharanappa, Foodpanda crime

The police tracked the accused bengaluru food delivery boy through the numbers provided by the victim in her complaint

వాట్సాప్ లో అమెను వ్యభిచారినిగా పేర్కొంటూ..

Posted: 07/12/2016 12:29 PM IST
Delivery boy seeks sex from customer after order dispute

ఫుడ్ డెలివరీ బాయ్ అమెకు నిద్రను కరవయ్యేలా చేశాడు. అదేంటి ఫుడ్ డెలివరీ బాయ్ తీసుకోచ్చిన అహారంలో అమెకు నిద్రను కరువయ్యేలా చేసిందనుకుంటున్నారా..? అలా అయితే పోరబడినట్లే. ఎందుకంటే.. పుడ్ డెలివరీ బాయ్ తీసుకోచ్చిన అహారాన్ని చూసి.. నచ్చకపోవడంతో అమె తిప్పిపంపింది. అయితే తిప్పిపంపేంచే సదుపాయం లేదని చెప్పిన డెలివరీ బాయ్ అమెను నుంచి డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశాడు. అందుకు అమె నిరాకరించడంలో అమెకు గుణపాఠం నేర్పిచేందుకు తీసుకున్న చర్యలు అమెకు నిద్రకరువయ్యేలా చేయగా, డెలివరీ బాయ్ ని కటకటాలు లెక్కించేలా చేస్తున్నాయి. ఇంతకీ డెలివరీ బాయ్ చేసిన పనేంటంటారా..?

లిల్లీ (పేరు మార్చాం) అనే మహిళ తనకు ఫుడ్ కోసం మెక్ డోనాల్డ్ కంపెనీకి ఫుడ్ పాండా ద్వారా ఆర్డర్ చేసింది. రాత్రి పది గంటల ప్రాంతంలో డెలివరీ బోయ్ ఆర్డర్ తీసుకొని వచ్చాడు. అయితే, అది తనకు నచ్చలేదని, వెనక్కి తీసుకెళ్లాలని చెప్పింది. అది సాధ్యం కాదని డెలివరీ బోయ్ చెప్పాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. డబ్బులు ఇచ్చేందుకు సదరు మహిళ నిరాకరించడంతో అమె పార్సిల్ ను అమె గడవ వద్దే పెట్టిన డెలివరీ బాయ్ ఆమెను దారుణంగా అసభ్య పదజాలంతో తిట్టాడు. సభ్యత లేకుండా ప్రవర్తించాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిన తర్వాత ఆమెను వ్యభిచారినిగా పేర్కోంటూ అమె ఫోన్ నెంబర్ వాట్సాప్ గ్రూప్లో పెట్టాడు. దాంతో ఆ రాత్రంతా గుర్తు తెలియని వ్యక్తులంతా ఆమెకు వేర్వేరు నెంబర్లతో ఫోన్ చేసి తమతో శృంగారానికి ఒప్పుకోవాలని, అందుకు ఆమె ఎంత తీసుకుంటుందో చెప్పాలంటూ వేధించారు.

దీంతో అమె మరో మార్గంలేక పోలీసులను అశ్రయించింది. తన ఫోన్ నెంబర్ కు రాత్రంతా పద్నాలుగు ఫోన్ నెంబర్ల నుంచి పదే పదే ఫోన్లు వచ్చాయని, వారంతా తనతో అసభ్యంగా ప్రపర్తించారని, అదే పనిగా వేధించడంతో తాను మనోవేధనకు లోనయ్యానని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన పిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నిసార్లు తిట్టి ఫోన్ పెట్టేసినా పదే పదే విసిరించారని అన్నారు. దీంతో ఆమె ఫోన్ వచ్చిన కాల్ లిస్టును సేకరించిన పోలీసులు కాల్ చేసిన వారి నెంబర్లను నోట్ చేసుకున్న పోలీసులు ఈ కేసు విషయంలో పెద్ద టీంను ఏర్పాటుచేసింది. డెలివరీ బోయ్ ని అదుపులోకి తీసుకుంది. కాగా, తమ సంస్థ తరుపున పనిచేసే డెలివరీ బోయ్స్ ఇలా చేయడం చాలా అరుదని తాము కూడా దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని ఓపక్క మెక్ డోనాల్డ్, మరో ఫుడ్ ఫాండా సంస్థల నిర్వాహకులు చెబుతున్నారు. డెలివరీ ఐటమ్ వాపస్ తీసుకునే సౌలభ్యం లేదని, అలా చేసినందుకు అమెకు గుణపాఠం చెప్పాలనే తాను ఇలా చేశానని డెలివరి బాయ్ అంగీకరించాడని పోలీసులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : food delivery boy  sexually harassment  woman  whatsapp  crime  

Other Articles