cid officials says sasi kumar is sucide

Sasi kumar realtives alleges its a murder

sasikumar, paderu asp, suspicious death, suicide, misfire, service revolver, accidental fire, head injury, Salem, Tamil Nadu, Allagaddda, young ips sasikumar, YV naidu

Young IPS Paderu ASP Sasi Kumar relatives conducted his last rites in his home town in tamilnadu, and alleges that he was murdered with a great skecth.

మా వాడిది హత్యే.. యువ ఐపీఎస్ బంధువుల అరోపణ

Posted: 06/18/2016 08:45 AM IST
Sasi kumar realtives alleges its a murder

యువ ఐఫీఎస్ అధికారి, విశాఖ జిల్లా పాడేరు ఏఎస్పీ కె.శశికుమార్ ది ముమ్మాటికీ హత్యేనని అరోపిస్తున్నారు ఆయన బంధువులు. నిన్న తమిళనాడులోని శశికుమార్ స్వగ్రామం ఈరోడ్ జిల్లా సత్యమంగళంలో ఆయనకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. ఈ సందర్బంగా ఆయన బంధువులు శశికుమార్ ది ముమ్మాటికీ హత్యేనని అరోపించారు. పథకం ప్రకారం శశికుమార్‌ను హత్య చేశారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగాను, అధికారికంగాను కక్ష కట్టిన కొందరు హతమార్చి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.

ఈ వ్యవహారంపై తమిళనాడు ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, సీబీఐ విచారణకు చర్యలు తీసుకునే విధంగా ఏపీ ప్రభుత్వంతో పాటు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఆయన రాసినట్లుగా బావిస్తున్న సూసైట్ నోట్ పై కూడా శశికుమార్ బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుండగా, విధి నిర్వహణలో గత మూడు నెలలుగా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నానని.. తన మరణానికి ఎవరూ బాధ్యులు కారని శశికుమార్ తన సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు. లేఖతో పాటు అక్కడ లభించిన ఆధారాలను బట్టి కూడా ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చామని కేసు విచారణ చేపట్టిన సీఐడీ డీఎస్పీ వై.వి.నాయుడు తెలిపారు.

శశికుమార్ తన రివాల్వర్‌తోనే కాల్చుకున్నారని, బయట నుంచి ఎవరో వచ్చి హత్య చేశారనేందుకు ఇప్పటి వరకూ ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. ‘మూడు నెలలుగా ఫెయిల్యూర్స్‌తో తీవ్ర డిప్రెషన్‌లో ఉన్నాను.. నేను ఈ డిపార్ట్‌మెంట్‌కు పనికిరాను.. నా చావుకు ఎవరూ బాధ్యులు కారు.. ఐయామ్ సారీ’ అని శశికుమార్ లేఖలో స్పష్టంగా పేర్కొన్నారని డీఎస్పీ వెల్లడించారు. అయితే దర్యాప్తు పూర్తయ్యాకే కచ్చితమైన నిర్ధారణకు రాగలమన్నారు. అయితే ఇది ముమ్మాటికీ హత్య అంటూ శశికుమార్ బంధువులు ఆరోపిస్తున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sasikumar  paderu asp  suspicious death  suicide  service revolver  Salem  Tamil Nadu  Allagaddda  

Other Articles