BBC drama Versailles set to shock viewers as co-creator insists 'sex is a fact of life'

Bbc s versailles dubbed porn dressed up in a cravat and tights

Versailles, France, 1667, Louis xiv, XIV, Louis, the fronde, civil war, bbc 2, bbc2, bbc two, George Blagden, News, TV, Radio, Culture

The new period drama looks set to make a household name of King Louis XIV actor George Blagden, after previews revealed it to be one of the BBC’s raunchiest commissions yet.

ITEMVIDEOS: ఆ సీరియల్ చూస్తే.. షాక్ తగులుతుంది..

Posted: 06/02/2016 02:41 PM IST
Bbc s versailles dubbed porn dressed up in a cravat and tights

బీబీసీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా, అత్యంత భారీ బడ్జెట్ తో రూపోందించిన సీరియల్ చూస్తే ఖచ్చితంగా షాక్ తగులుతుందని అంటున్నారు వీక్షకులు. 17వ శతాబ్దంలో ఫ్రాన్స్‌ను పాలించిన చక్రవర్తి లూయిస్-14 జీవితకథ ఆధారంగా రూపొందించిన సీరియల్ చూడగానే అనేక మంది ప్రేక్షకులు తమ బాత్ రూమ్ లలోకి వెళ్లాల్సి వచ్చిందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. బీబీసీ ఛానెల్ 2 లో ప్రసారమవుతున్న 'వర్సల్లెస్‌' సీరియల్‌ తొలి ఎపిసోడ్‌లోనే ఏడు శృంగార సన్నివేశాలు ఉండటంతో వీక్షకులు బిత్తరపోయారు.

ఈ ఏపిసోడ్‌లో పూర్తిస్థాయి నగ్న సన్నివేశాలను ఎలాంటి కత్తెరలు లేకుండా చూపించారు. దీంతో ప్రజల అగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రైమ్‌టైమ్‌లో బీబీసీలో ప్రసారమవుతున్న ఈ సీరియల్‌పై గత కొంతకాలంగా నిరసన వ్యక్తమవుతున్నది. ఈ సీరియల్‌ నిండా నగ్న దృశ్యాలు, గ్రాఫిక్ శృంగార దృశ్యాలు ఉండటంతో.. ఈ సీరియల్‌ ప్రారంభానికి ముందే బ్రిటన్‌ హక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. బీబీసీ మాత్రం ఫ్రాన్స్‌లో నిర్మితమైన ఈ సీరియల్‌ వీక్షకులకు మాంఛి కనువిందు ఇస్తుందని పేర్కొంటున్నది.

దాదాపు రూ. రెండు వందల కోట్ల (21 మిలియన్ పౌండ్ల) ఖర్చు.. అత్యంత భారీ తారాగణం.. చరిత్రను కళ్లకు కట్టే కథనంతో ప్రసారమవుతున్న ఈ సీరియల్‌పై ఇటు వీక్షకులు కూడా నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు. ఎంత ఖర్చుపెట్టి.. అట్టహాసంగా నిర్మించినా సీరియల్‌లో డైలాగ్‌లు నాసిరకంగా ఉన్నాయని, తొలి ఎపిసోడ్‌ ఏమాత్రం ఆసక్తికరంగా లేదని పలువురు వీక్షకులు ట్విట్టర్‌లో పెదవి విరిచాడు. అనేక అంచనాలు రేపిన ఈ సీరియల్‌లో లూయిస్ గా కనిపించిన జార్జ్‌ బ్లాగ్డెన్‌ కూడా ఏమాత్రం ఈ పాత్రకు సరిపోలేదని విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.

శృంగారం జీవితంలో భాగమని చాటిచెబుతున్న ఈ సీరియల్ లో శృంగారమే ఇతివృత్తంగా రూపోందిందన్న విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. సన్‌ కింగ్‌గా పేరొందిన లూయిస్‌ -14 జీవితంలోని ఉత్థానపతనాలు చిత్రీకరించే ఈ సీరియల్‌ బ్రిటన్‌లోనే తొలి సెక్సువల్ గ్రాఫిక్‌ డ్రామాగా పేరొందింది. ఈ సీరియల్ మొదటి ఎపిసోడ్‌లోనే గే సెక్స్‌, రాజకుమారుడి క్రాస్ డ్రెసింగ్‌, రాకుమారి విపరీతమైన వ్యామోహం వంటి దృశ్యాలను చూపించారు. ఈ సీరియల్‌ను ఫ్రాన్స్‌లో నిర్మించినప్పటికీ ఇంగ్లిష్ భాషలో రూపొందించారు. దీంతో ఫ్రాన్స్ వీక్షకులు దీనిని ఫ్రెంచ్‌ సబ్‌టైటిల్స్‌తో చూడాల్సి ఉంటుంది. ప్రముఖ ఫ్రెంచి చక్రవర్తి అయిన లూయిస్-14 జీవితాన్ని, చరిత్రను వక్రీకరిస్తుండటంతో ఫ్రాన్స్‌లో ఈ సీరియల్‌పై వివాదం రేగుతోంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BBC  porn  Versailles  France  1667  Louis xiv  XIV  Louis  the fronde  civil war  

Other Articles