ఆ సినిమాలు అతిగా చూస్తే.. | If see porn movies

If see porn movies

Porn, Porn cinemas, blue films, spiritual, పోర్న్, సెక్స్

In A latest survey, porn movies will effect our mind. Its will impact spiritual consious.

ఆ సినిమాలు అతిగా చూస్తే..

Posted: 05/17/2016 07:32 AM IST
If see porn movies

కామికాని వాడు యోగి కాలేడు అని తెలుగులో ఓ సామెత ఉంటుంది. అది కేవలం మాటలే అని చాలా మంది అనుకుంటుంటాం కానీ అదే నిజం. తాజాగా పోర్న్ సినిమాలు చూసేవారి మీద చేసిన సర్వేలో ఇదే విషయం తేటతెల్లమైంది. తరచుగా పోర్న్‌ సినిమాలు చూసే వారిలో కనబడే మార్పు ఏమిటి? అంటే అందరూ వారిలో శృంగార భావనలు, లైంగిక కోర్కెలు పెరుగుతాయని సమధానం చెబుతారు. అయితే ఇటీవల నిర్వహించిన ఓ సర్వే షాకింగ్‌ ఫలితాలు వెల్లడించింది. తరచుగా పోర్న్‌ చూసే వారిలో ఆధ్యాత్మిక భావనలు వెల్లివెరిస్తాయట. ఈ ఫలితాలను అమెరికాకు చెందిన ‘జర్నల్‌ ఆఫ్‌ సెక్స్‌ రీసెర్చ్‌’ ఇటీవల వెల్లడించింది.

వారానికి కనీసం ఒకసారి లేదా అంతకంటే ఎక్కువగా పోర్న్‌ సినిమాలు చూసే వారు ఎక్కువగా మతసంబంధమైన ప్రార్థనల్లో పాల్గొంటున్నట్టు ఆ సర్వేలో తేలిందట. దాదాపు ఆరు సంవత్సరాల పాటు 1300 మంది స్త్రీ, పురుషులపై ఈ సర్వే నిర్వహించారట. పోర్న్‌ సినిమాలు చూడడం ద్వారా కలిగే గిల్టీ ఫీలింగ్స్‌ను పోగొట్టుకోవడానికే వారు దైవ సంబంధమైన ప్రార్థనల్లో పాల్గొంటున్నారట. అయితే ఈ సిద్ధాంతం పోర్న్‌ సినిమాలను కొత్తగా చూసేవారికే వర్తిస్తుందట. బ్రష్‌ చేస్తున్నట్టు, టిఫిన్‌ చేసినట్టు, రోజూ పోర్న్‌ చూసేవారిలో గిల్టీ ఫీలింగ్స్‌ లాంటివేమీ ఉండవట. అయితే ఈ సర్వేలో మరో ఆసక్తికర విషయం కూడా వెల్లడైంది. పోర్న్‌ను అదే పనిగా చూసే వారిలో కొన్నాళ్లకు వైరాగ్య భావన నెలకొంటుందని… చివరకు పోర్న్‌ను పక్కన పెట్టి ఆధ్యాత్మికత వైపు మళ్లుతారని తేలింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Porn  Porn cinemas  blue films  spiritual  పోర్న్  సెక్స్  

Other Articles