భార్య నుండి కాపాడాలంటున్న భర్త | Husband complaint on wife for beating him

Husband complaint on wife for beating him

Banglore, Wife, Husband, Chat, Message, భార్య, భర్త, మెసేజ్ లు, బెంగళూరు

A poor Husband filed a police case on his wife for beating and attempt murder. banglore resident software employee gave a complaint on his wife.

భార్య నుండి కాపాడాలంటున్న భర్త

Posted: 05/16/2016 10:44 AM IST
Husband complaint on wife for beating him

బాబోయ్.. నా భర్త నన్ను రోజూ కొడుతున్నాడు అని భార్య ఫిర్యాదు. కట్నం డబ్బుల కోసం వేధింపులకు పాల్పడుతున్న భర్త అని ఇలా రోజుకు ఓ నాలుగు వార్తలు మహిళల మీద వేధింపుల గురించి వింటుంటాం. కానీ ఓ మగాడు తనను తన భార్య కొడుతోందని.. తనను రక్షించాలని ఎవ్వరైనా ఫిర్యాదు చెయ్యడం చూశారా..? కానీ ఇది నిజంగా జరిగింది. ఓ బాధిత భర్త పోలీస్ స్టేషన్ కు వెళ్లి నా భార్య నన్ను కొడుతోంది.. చంపడానికి కూడా ప్రయత్నిస్తోంది అంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దాంతో ముందు పోలీసులు లైట్ గా తీసుకున్నా తర్వాత మాత్రం సీరియస్ గా తీసుకున్నారు. అసలు ఏం జరిగిందంటే..

బెంగళూరు నగరానికి చెందిన ఓ వ్యక్తి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, తన భార్యతో పాటు ఉంటున్నాడు.కానీ ఇద్దరి మధ్యన ఎక్కడో అగాదం వచ్చింది. ఓ రోజు ఇంటికి వచ్చిన భర్త తన భార్య ఫోన్ లో ఛాట్ చేస్తుండటం గమనించాడు. దాంతో భార్య పోన్ లోని ఛాట్ చూసి షాకయ్యాడు. అందులో అన్ని బూతు మెసేజ్ లు ఉండటంతో ఖంగుతిన్నాడు. ఆ మెసేజ్ లు ఎవరికి పంపించావో చెప్పమంటూ ఆమెను ప్రశ్నించాడు. వెంటనే ఫోన్ లాక్కుని లాక్ చేసింది. కిచెన్‌లోకి వెళ్లి కత్తి తీసుకుని వచ్చి తనను గాయపరిచిందని ఆరోపిస్తున్నాడు. కనీసం గాయమైనా పట్టించుకోలేదని... ఇరుగుపొరుగు వారి సాయంతో ఆసుపత్రిలో చేరానని పోలీసుల వద్ద సంజయ్ బోరున విలపించాడు. అయితే ఈ విషయంపై ఇందూ వాదన మరోలా ఉంది. తన భర్తే తనను కట్నం కోసం వేధిస్తున్నాడని... ఇదంతా డ్రామా అని చెప్పింది. ఏది నిజమో నిగ్గు తేల్చేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు

-Abhinavachary

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles