ఇది అన్నాచెల్లెల్ల ప్రేమ కథ | This is Brother and Sister love story

This is brother and sister love story

Lovers, Srikakulam, Sister, Brother, శ్రీకాకుళం, లవర్స్, ప్రేమికులు

In Srikakulam District, Brother and Sister fall in love. That girl atempt suicide. They ate not convencing with any words.

ఇది అన్నాచెల్లెల్ల ప్రేమ కథ

Posted: 05/10/2016 01:38 PM IST
This is brother and sister love story

ఈ మధ్యన మానవ సంబందాలు ఎలా మారోయో చెప్పడానికి ఈ ఘటనే చక్కటి ఉదాహరణ. వరుసకు అన్నా చెల్లుల్లు నడిపిన ప్రేమ వ్యవహారం చూసిన వాళ్లు, విన్న వాళ్లు షాకవుతున్నారు. అదేంటి అన్నా చెల్లెల్లు ప్రేమించుకున్నారా..? అని షాకవుతున్నారా.? అక్షరాల నిజం. ఒకరిని  మరొకరు విడిచి ఉండలేనంత ప్రేమ వారిద్దరిది. అన్నా చెల్లుల్లు ప్రేమించుకోవడం ఏంటీ అని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మాయి తరఫు బంధువులకు, అబ్బాయి తరఫు బంధువులకు గొడవల దాకా వెళ్లింది వ్యవహారం. అమ్మాయి అబ్బాయిని విడిచి ఉండలేక ఆత్మహత్యయత్నం కూడా చేసుకుంది. ఇది శ్రీకాకుళంలో జరిగిన యదార్థగాధ.

శ్రీకాకుళం జిల్లా సంతకవిటికి చెందిన ఓ అమ్మాయి  అదే గ్రామానికి చెందిన పెద్దనాన్న కొడుకు ప్రేమలో పడింది.ఆ యువ‌కుడి తల్లిదండ్రులు విజయనగరంలో ఉంటున్నారు. యువతి అప్పుడప్పుడు పెద్దనాన్న ఇంటికి వచ్చిన క్రమంలో వారి మధ్య ప్రేమ మొదలైంది. దీంతో.. ఇద్దరూ కలిసి రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు చెబుతున్నారు. ఈ విషయంపై ఇరు వర్గాల పెద్దలకు తెలిసి.. తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో సదరు యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.  ఆ యువ‌తికి అన్నను పెళ్లాడ‌డం త‌ప్పని ఎంత చెప్పినా వినిపించుకోవ‌డం లేదు.  దాంతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు యువతి వాంగ్మూలం తీసుకున్నారు. వరుసకు ఇద్దరూ అన్నాచెల్లెళ్లు కావటంతో కేసు నమోదు చేయకుండా.. కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles