US Presidential Elections Not a Reality Show, Obama Tells Trump

Us presidential elections not a reality show obama tells trump

barack obama, Democrat, donald trump, Hillary Clinton, republican, US Presidential Elections 2016, White House

US President Barack Obama warned Republican nominee, Donald Trump that the race to the White House was not a "reality show" and called for a close scrutiny of the controversial billionaire's past record and statements.

రియాల్టీ షో కాదు.. దేశాన్ని పరిరక్షించే బాధ్యత..

Posted: 05/08/2016 10:25 AM IST
Us presidential elections not a reality show obama tells trump

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా.. అగ్రరాజ్యం అధ్యక్ష బరిలో రిపబ్లికన్ అభ్యర్థిగా రేసులో ముందంజలో వున్న డోనాల్డ్ ట్రంప్ కు హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడటమంటే రియాల్టీ షోలో పాల్గొనడం అనుకుంటున్నావా? అంటూ ఆయనను  ప్రశ్నించారు. టీవీ నేపథ్యంలో నుంచి వచ్చిన వ్యక్తిగా ట్రంప్‌ను అభివర్ణించిన ఒబామా..అధ్యక్ష అభ్యర్థిగా పోటీపడటమంటే వినోదం కాదన్నారు. ‘ఇది రియాల్టీ షో కాదు ప్రతిష్టాత్మకమైన అమెరికా అధ్యక్ష పదవికి జరిగే పోటీ అని గుర్తుంచుకోవాలి’ అని హితవు పలికారు.

అమెరికాలోని సమస్యలపై ట్రంప్ అనేక సమయాల్లో పలురకాలుగా స్పందించారన్నారు. అమెరికాలో ముస్లింలు, అక్రమ వలసదారులను అనుమతించనంటూ, మెక్సికో వలసదారులు ప్రవేశించకుండా గోడ కడతానని చెప్పడంపై ఒబామా స్పందించారు. దేశ ప్రజల భవిష్యతుకు అధ్యక్ష పదవి ఒక నమ్మకం, దేశాభివృద్దికి అధ్యక్ష పదవి ఒక విశ్వాసం, దేశ ప్రజల సంక్షేమానికి అధ్యక్ష పదవి ఒక ముందడుగు అని చెప్పారు. ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు మానుకోవాలని సూచించారు. విదేశాంగ విధానంలో కూడా ట్రంప్ అనవసర వ్యాఖ్యలు చేస్తున్నాడని అన్నారు.

అధ్యక్ష బరిలో ఉన్న అభ్యర్థులు అమెరికా ప్రమాణాలకు అనుగుణంగా, వాస్తవిక ధోరణితో వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. రిపబ్లికన్ పార్టీ ఇప్పటికైనా తమ అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టాలనే విషయమై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని ఒబామా ట్రంప్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. కాగా, అమెరికాలో రానున్న కొత్త ప్రభుత్వానికి అధికార మార్పిడి సజావుగా జరిగేందుకు వీలుగా పన్నెండు మంది సభ్యులతో కూడిన ‘వైట్‌హౌస్ ట్రాన్సిషన్ కమిటీ’ని ఒబామా ఏర్పాటు చేశారు.

జి, మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : President Barack Obama  Donald Trump  US Presidential Elections  republican party  

Other Articles