Man admits murdering housemate after she refused to have sex with him

Man pleads guilty to murder of katy rourke

Broughty Ferry woman, Katy Rourke, Gary Stevenson, Glasgow, city’s High Court, Courts, Glasgow, Sex, frustration, stabbing, former Grove Academy pupil, Minto Street, Bruce Erroch,

GARY Stevenson, 27, confessed to police that he killed 25-year-old fashion buyer Katy and told them: "I stabbed her. I think it was three times."

సెక్స్ కు అంగీకరించలేదని అమెను నేనే పోడిచి చంపాను..

Posted: 04/11/2016 09:08 PM IST
Man pleads guilty to murder of katy rourke

తనతో శృంగారంలో పాల్గొనేందుకు నిరాకరించిందనే కారణంతో తన ఫ్లాట్ మేట్, ప్రముఖ ఫ్యాషన్ బయర్ కాటి రూర్కే(27)ను పొడిచిపొడిచి చంపినట్లు గ్యారీ స్టీవెన్సన్(27) తెలిపాడు. లండన్ కు చెందిన గ్యారీ స్టీవెన్సన్ అనే వ్యక్తి ఓ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. అతడు కాటి రూర్కే అనే ఫ్యాషన్ బయర్ తో బాగా చనువుగా ఉండేవాడు. గ్లాస్గోలోని క్రెయిగ్టాన్లోగల మింటో వీధిలోని గమ్ ట్రీ అపార్ట్ మెంట్లో వారు ఉండేవారు. డిసెంబర్ 29 రాత్రి వారిద్దరూ కలసి మద్యం సేవించారు, అనంతరం వారిద్దరూ కలసి శృంగారంలో మునిగి తేలారు

ఆ తరువాత తన బెడ్ రూమ్ లోకి వెళ్తున్నట్లు బయటకు వెళ్లిన స్టీవెన్ సన్ మరికోంత మధ్యం సేవించిన అనంరతం తిరిగి కాటి రూర్కే గదిలోకి వచ్చాడు, మళ్లీ అమెతో శృంగారంలో పాల్గోనేందుకు ప్రయత్నించాడు, అయితే రెండోసారి మళ్లీ శృంగారానికి ఉపక్రమిస్తున్న స్నేహితుడిని అమె పక్కకు తోసింది. మళ్లీ తాను శృంగారంలో పాల్గోనలేనని నిరాకరించింది, అయితే అప్పటికే పీకలదాక మధ్యం సేవించిన స్టీవెన్ సన్ అమెను సెక్స్ లో పాల్గోనాలని బలవంత పెట్టాడు. దీంతో ఇద్దరి మధ్య తొలుత ఒక స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది.

దీంతో కోపంతో ఊగిపోయిన స్టీవెన్ సన్ వంటగదిలోకి వెళ్లి కత్తిని తీసుకువచ్చి అమె చాతితో మూడు పర్యయాలు పోడిచాడు, ఆ తరువాత అమె బెడ్ పైనే నిద్రలోకి జారుకున్నాడు, మరుసటి రోజు ఉదయం లేది చూసి రాత్రి జరిగిన ఘటనను గుర్తుకు తెచ్చుకున్న స్టీవెన్ సన్, ప్లాట్ ప్రధాన ద్వారం గడియను లోపలి నుంచి పెట్టి ఆ తరువాత వంటగదిలోంచి డ్రైనేజీ  పైపులైనును పట్టుకుని కిందకు దిగి, తన స్వగ్రామానికి రైలులో బయలుదేరి వెళ్లాడు, కేసును దర్యాప్తు చేసిన పోలీసులు అతడి వేలిముద్రలు, ఘటనాస్థలంలో లభించిన ఆదారాలతో అతన్ని అరెస్టు చేశారు.

అయితే ఈ కేసు విచారణలో బాగంగా ఇవాళ కోర్టులో స్టీవెన్ సన్ తన నేరాన్ని అంగీకరించాడు. తాను కోపంతో ఆమెను కత్తితో పొడిచేసి అదే ఫ్లాట్ లో వదిలేసి పారిపోయానని చెప్పాడు. 'నేను ఆరోజు ఆమెను పొడిచాను. మూడుసార్లు పొడిచానని అనుకుంటున్నాను. ఒక వేళ ఆమెను కాకుంటే మరొకరిని అయి ఉండేదేమో. ఆ సమయంలో నా పరిస్థితి అలా ఉంది. కుటుంబం కోసం ఆ రోజు ఓ నిజం చెప్పాలని అనుకున్నాను. కత్తితోపొడిచేందుకు ముందు బలంగా చాలాసార్లు కొట్టాను. మా మధ్య ఒప్పందం కుదరకపోయే సరికి నాపై నియంత్రణ కోల్పోయాను. అంతే ఆమెను కొట్టడం ప్రారంభించి ఇక ఆపలేకపోయాను. అలా కొడుతూ కొడుతూ కొడుతూనే ఉండి.. తర్వాత పొడిచేశాను' అని వివరణ ఇచ్చాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Katy Rourke  Gary Stevenson  Glasgow  city’s High Court  Courts  Glasgow  Sex  

Other Articles