KCR to reshuffle his Cabinet soon

Telangana cm kcr may expand his cabinet reshuffle expected

KCR, telangana Cabinet reshuffle, cabinet extension, ts, tdp, kcr, ministers, koppula eeshwar, konda surekha

The politics hotted up in Hyderabad suddenly as Telangana Chief Minister KCR is planning a cabinet rejig. KCR will meet Governor ESL Narasimhan with a list of proposed changes

త్వరలోనే తెలంగాణ మంత్రివర్గం విస్తరణ.. అమాత్యులయ్యే అదృష్టవంతులెవరో..

Posted: 04/09/2016 03:21 PM IST
Telangana cm kcr may expand his cabinet reshuffle expected

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తన మంత్రివర్గంలో చోటు కోసం గత రెండేళ్ల నుంచి ఆశగా ఎదురుచూస్తున్న ఎందరో పార్టీ శాసనసభ్యులకు త్వరలో శుభవార్త అందనుంది, కేసీఆర్ మంత్రివర్గంలో త్వరలో మార్పులు, చేర్పులు జరగనున్నాయన్న వార్తలు చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. కొత్తగా టీఆర్ఎస్లో చేరిన కొందరు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడంతో పాటు ప్రస్తుత మంత్రుల్లో కొందరి శాఖలను మార్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండేళ్లు కావస్తుండగా, ముఖ్యమంత్రి కేబినెట్లో స్థానం కోసం ఆయన హామీ పోందిన పలువురితో పాటు మరికోందరు కూడా కెబినెట్ లో స్థానం కోసం వేచి చూస్తున్నారు, ఇక అటు మహిళలకు కేబినెట్ లో స్థానం లేకపోవడంతో విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈ సారి కెబినెట్ లో వారికి కూడా స్థానం కల్పించాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. మంత్రివర్గ కూర్పు విషయంపై కేసీఆర్ సన్నిహితులతో చర్చించారని, దీనికి సంబంధించి కసరత్తు పూర్తిచేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొందరు మంత్రుల సమర్థతపై వచ్చిన ఫిర్యాదులను, అవినీతి ఆరోపణలను కూడా పరిశీలించినట్టు తెలుస్తోంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  telangana Cabinet reshuffle  cabinet extension  ts  tdp  kcr  ministers  koppula eeshwar  konda surekha  

Other Articles