England beats newzeland by 7 wkts

England beats newzeland by 7 wkts

Newzeland, England, World T20, Semi finals, England Vs Newzeland, Eion Morgan

England skipper Eoin Morgan will feel slightly uneasy with the position he finds himself in. After a stupendous March night when his team stalked the tournament favourites, he is at the cusp of winning England’s second-ever global tournament. Few of his limited-overs predecessors – save Paul Collingwood – were afforded this liberty of a smile, let alone any celebratory excesses

న్యుజిలాండ్ ఓటమి.. ఫైనల్ లో ఇంగ్లండ్

Posted: 03/31/2016 06:50 AM IST
England beats newzeland by 7 wkts

విజయాలతో ముందుకెళ్లిన న్యూజిలాండ్ జట్టు సెమీఫైనల్లో బోల్తా పడింది. ఇంగ్లాండ్ చేతిలో పరాజయం పాలై వరల్డ్ కప్ రేస్ లోంచి నిష్క్రమించింది. సూపర్ టెన్ లో ఓటమి ఎరుగని ఆ జట్టుకు ఇంగ్లీష్ బ్యాట్స్ మెన్స్ చుక్కలు చూపించారు. 154 రన్స్ టార్గెట్ ని చాలా సులువుగా ఛేదించేసింది. నిజానికి న్యూజిలాండ్ ఆరంభం నుంచే చాలా ధాటిగా ఆడింది. కానీ, ఆ జట్టు భారీ స్కోరు సాధించలేకపోయింది. ఇరవై , ముప్పై రన్స్ తక్కువే కొట్టింది. స్లాగ్ ఓవర్స్ లో ఇంగ్లాండ్ బౌలర్స్ చాలా తెలివిగా బౌలింగ్ చేశారు.

ఇక బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు అతి తక్కువ టార్గెట్ అనుకుందో ఏమో చాలా అలవోకగా బ్యాటింగ్ చేసింది. ముఖ్యంగా ఓపెనర్ రాయ్ న్యూజిలాండ్ బౌలర్స్ ని చితకారేశాడు. బ్యాటింగ్ చేయడం నాకు ఎంతో ఈజీ అన్నట్లుగా ఉతికి ఆరేశాడు. బహుశా సౌత్ ఆఫ్రికా పైన 230 టార్గెట్ నే కొట్టాం ఇదో పెద్ద లెక్క అనుకున్నారేమో అతి సులువుగా టార్గెట్ ని ఛేదించేశారు. ఆ పట్టుదలే ఇంగ్లండా జట్టును ఫైనల్ కి చేర్చింది. మామూలుగా 150 రన్స్ పైనే ట్వంటీ ట్వంటీ లలో కొట్టాలంటే ఆ మ్యాచ్ కనీసం లాస్ట్ ఓవర్ వరకూ సాగుతుంది. కానీ, ఇంగ్లాండ్ కేవలం 17 ఓవర్లలోనే మ్యాచ్ ని ముగించేసి రెండోసారి ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ పైనల్లోకి ప్రవేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Newzeland  England  World T20  Semi finals  England Vs Newzeland  Eion Morgan  

Other Articles