Senior producer Jayakrishna passes away

Tollywood producer jayakrishna is no more

producer, jayakrishna, senior producer, muddu krishna, Producer Jaya Krishna, Producer Jaya Krishna is no more, Jaya Krishna no more, Telugu producer Jaya Krishna, producer Jaya Krishna death

Senior producer Jayakrishna, popularly regarded as the man who shaped up megastar Chiranjeevi's career in the beginning stage, is no more.

టాలీవుడ్ సీనియర్ నిర్మాత జయకృష్ణ కన్నుమూత..

Posted: 03/29/2016 08:15 PM IST
Tollywood producer jayakrishna is no more

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత జయకృష్ణ కన్నుముశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. సీనియర్ నటులు కృష్ణంరాజు, జయసుధ లకు మేకప్ ఆర్టిస్టుగా తెలుగు సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన జయకృష్ణ తర్వాత నిర్మాతగా మారారు. పలు విజయవంతమైన సినిమాలకు నిర్మాణ సారధ్యం వహించారు. మన ఊరి పాండవులు (1978), మంత్రిగారి వియ్యంకుడు (1983), నీకు నాకు పెళ్లంట (1988) తదితర  చిత్రాలను  ఆయన  నిర్మించారు.   

బాపు దర్శకత్వంలో చిరంజీవి హీరో గా  జయకృష్ణ   నిర్మించిన 'మన ఊరి పాండవులు'  ఫిలిం ఫేర్ అవార్డు గెల్చుకుంది. ఇంకా  సీతారాములు, కృష్ణార్జునులు, వివాహభోజనంబు తో పాటు  15 స్ట్రెయిట్ చిత్రాలు, 22 డబ్బింగ్ సినిమాలను  ఆయన నిర్మించారు.  గతంలో స్టార్ హీరోలతో సినిమాలు తీసిన జయకృష్ణ నిర్మించిన చివరి సినిమా దాసు.  జయకృష్ణ సుదీర్ఘ విరామం తరువాత  సినీనటి తారాచౌదరి జీవిత చరిత్రపై  సినిమా నిర్మించాలని  ప్రయత్నించారు.   జయకృష్ణ మూవీస్ పతాకంపై 'ఒక తార' అనే సినిమాను నిర్మిస్తున్నట్టు ప్రకటించారు. ఆయన మృతి  తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు పలువురు సంతాపం తెలిపారు. అతని

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tollywood  producer  jayakrishna  senior producer  muddu krishna  

Other Articles